Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ 'జన నాయకుడు' టైటిల్ కార్డ్ లీక్

విజయ్ 'జన నాయకుడు' టైటిల్ కార్డ్ లీక్

వార్త 2 weeks ago

Jana Nayakudu Movie: తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత రాజకీయ నాయకుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయకుడు' చుట్టూ ఇప్పుడు పెను సంచలనం నెలకొంది.

ఈ సినిమా టైటిల్ కార్డ్ అంటూ ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో “తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్” అని రాసి ఉండటం చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

Read Also:Avika Gor: 'అగ్లీ స్టోరీ' షూటింగ్‌లో ఇబ్బంది పడ్డాను.. అవికా గోర్ షాకింగ్ కామెంట్స్

Jana Nayakudu Movie: వీడియో నిజమా? ఎడిటింగా?

వైరల్ అవుతున్న ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఇటీవలే తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారి, తన పార్టీ ‘టీవీకే’ను అధికారంలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సినిమాలో ఆయనను సీఎంగా చూపించడం సహజమేనని కొందరు అంటుంటే.. ఇది కేవలం AI (కృత్రిమ మేధ) సృష్టించిన ఎడిటెడ్ వీడియో అయి ఉంటుందని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సెన్సార్ సమస్యలు – విడుదల వాయిదా

దర్శకుడు హెచ్. వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పూర్తిస్థాయి రాజకీయ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ కారణం చేతనే సెన్సార్ బోర్డు నుండి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతి (పొంగల్) కానుకగా విడుదల చేయాలని భావించారు. సెన్సార్ సర్టిఫికేట్ రావడం ఆలస్యం కావడంతో సినిమా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మే 15న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. విజయ్ కెరీర్‌లో ఇదే చివరి సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఈ సినిమా ఒక బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha