Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లైన్‌మెన్‌ను ముంచిన సైబర్ ముఠా.. ఏకంగా రూ. 94 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!

లైన్‌మెన్‌ను ముంచిన సైబర్ ముఠా.. ఏకంగా రూ. 94 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!

వార్త 3 months ago

Cyber Crime: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు మరో ఘోరానికి ఒడిగట్టారు. అధిక లాభాల ఆశ చూపి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL)లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి నుంచి ఏకంగా రూ.

94.11 లక్షలను కొల్లగొట్టారు. గత ఏడాది నవంబర్ నెలలో బాధితుడు ఫేస్‌బుక్ బ్రౌజ్ చేస్తున్న సమయంలో ఒక ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ పేరుతో ఉన్న ప్రకటన కనిపించింది. తక్కువ పెట్టుబడితో లక్షల లాభాలు వస్తాయన్న మాటలు నమ్మి ఆయన అందులోని లింక్‌ను క్లిక్ చేశారు. వెంటనే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ ద్వారా బాధితుడిని సంప్రదించారు. తాము అంతర్జాతీయ ట్రేడింగ్ నిపుణులమని నమ్మబలికి, ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించారు.

Read Also : TG Inter Admissions:తెలంగాణ ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల

 Cyber ​​scam against linemen: Rs. 94 lakh looted by thieves!

Cyber Crime: నకిలీ గ్రాఫిక్స్‌తో నమ్మించారు

ఆ యాప్‌లో చమురు, బంగారం స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని కేటుగాళ్లు నమ్మించారు. మొదట చిన్న మొత్తంలో ట్రేడింగ్ చేయించి, యాప్‌లో లక్షల్లో లాభాలు వస్తున్నట్లు నకిలీ గ్రాఫిక్స్‌ను చూపించారు. అది నిజమైన లాభమే అని నమ్మిన బాధితుడు తన దగ్గర ఉన్న పొదుపు మొత్తంతో పాటు, ఆస్తులు అమ్మి ,అప్పులు చేసి భారీగా పెట్టుబడులు పెట్టారు. 2025 నవంబర్ 6 నుండి 2026 మార్చి 23 మధ్య. ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా వివిధ విడతల్లో రూ. 94.11 లక్షలు బదిలీ చేశారు.

విత్‌డ్రా సమయంలో అసలు స్వరూపం

పెట్టిన పెట్టుబడికి కోట్లలో లాభం కనిపిస్తుండటంతో, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించారు. అయితే, అక్కడే అసలు మోసం బయటపడింది. డబ్బు తీసుకోవాలంటే ట్యాక్సులు, కమిషన్లు, ప్రాసెసింగ్ ఫీజుల పేరిట మరిన్ని లక్షలు చెల్లించాలని నిందితులు డిమాండ్ చేశారు. వారు అడిగినవన్నీ చెల్లించినా రూపాయి కూడా వెనక్కి రాకపోవడంతో, చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు మే 1న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు.

పోలీసుల హెచ్చరికలు:

బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నేరగాళ్లు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఆకర్షణీయమైన పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దు. తక్కువ కాలంలో కోట్లు సంపాదించవచ్చనే యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు అది సెబీ (SEBI) గుర్తింపు పొందిన సంస్థో కాదో చెక్ చేసుకోండి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

19 మంది బాలికలను ట్రాప్ చేసిన అన్నదమ్ములు !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha