Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లక్నోపై చెన్నై ఘనవిజయం.. ప్లేఆఫ్స్ రేసు నుండి LSG నిష్క్రమణ

లక్నోపై చెన్నై ఘనవిజయం.. ప్లేఆఫ్స్ రేసు నుండి LSG నిష్క్రమణ

వార్త 3 months ago

CSK vs LSG: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించింది.

Read Also:RCB vs MI Match : టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానం

ఊర్విల్ పటేల్ విధ్వంసం.. గైక్వాడ్ సమయోచితం

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిగిన చెన్నైకి ఊర్విల్ పటేల్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే 65 పరుగులు చేసి లక్నో బౌలర్లను చిత్తు చేశాడు. మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 42 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

 CSK vs LSG IPL Highlights

మధ్యలో వికెట్లు పడి ఉత్కంఠ రేపినప్పటికీ, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్ అద్భుతమైన సమన్వయంతో ఆడి చెన్నైని విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరి బాధ్యతాయుతమైన ఆట తీరుతో చెన్నై మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

CSK vs LSG: ముగిసిన లక్నో ప్లేఆఫ్ ఆశలు

ఈ మ్యాచ్ లక్నోకు అత్యంత కీలకం. కనీసం ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండేవి. కానీ, భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ విభాగంలో విఫలం కావడంతో ఈ సీజన్ నుండి లక్నో నిష్క్రమించాల్సి వచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇంగ్లిస్ తుఫాన్.. చెన్నై ముందు 204 పరుగుల భారీ లక్ష్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha