Tamil Nadu: తమిళనాడులో అవినీతిని నిర్మూలించే దిశగా ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య ప్రజలను లంచం అడిగే అధికారుల వివరాలను వీడియో ఆధారాలతో సహా పట్టిస్తే వారికి ఏకంగా లక్ష రూపాయల నగదు బహుమతిగా అందిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో అవినీతిపై పోరాటంలో ఈ నూతన పథకం ఒక కీలకమైన ముందడుగుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనికైనా, పెద్ద పనికైనా ఏ అధికారి అయినా సరే కనీసం వెయ్యి రూపాయల లంచం డిమాండ్ చేసినా బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితులు చేయాల్సిందల్లా.. లంచం అడుగుతున్న అధికారి వ్యవహారాన్ని తమ మొబైల్ ఫోన్లలో రహస్యంగా వీడియో తీసి దానిని ఆధారంగా చూపిస్తూ అవినీతి నిరోధక శాఖకు (ACB) రిపోర్ట్ చేయడమే. ఈ ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు విచారణ జరిపి, అందులోని నిజానిజాలను నిర్ధారించుకుంటారు. ఆ లంచం ఆరోపణ నిజమని తేలితే, సమాచారం అందించిన వ్యక్తికి ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల బహుమతిని అందజేస్తారు.
CM Vijay offers a reward of one lakh rupees for catching officials who ask for bribes
Tamil Nadu: పరిపాలనలో విప్లవాత్మక మార్పు
అవినీతిపైనే కాకుండా రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ మద్యం రవాణాపై కూడా సీఎం విజయ్ యుద్ధం ప్రకటించారు. తమిళనాడులో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ కొన్నా, అమ్మినా గూండా చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. "ప్రజల డబ్బులోంచి నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోను, అవినీతి రహిత పాలనను అందిస్తాను" అని సీఎం విజయ్ స్పష్టం చేశారు.
మరోవైపు సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం లంచాలకు అలవాటుపడిన ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దీనికి తోడు సీఎం విజయ్ స్వయంగా ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా ప్రతిరోజూ సచివాలయ కార్యాలయానికి కరెక్ట్ సమయానికి వచ్చి విధులు నిర్వర్తించడం అధికారులందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

