Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విధే వెక్కిరించింది.. కొడుకు మార్కులు చూసి మురిసిపోయేలోపే కన్నవారికి కడుపుకోత!

విధే వెక్కిరించింది.. కొడుకు మార్కులు చూసి మురిసిపోయేలోపే కన్నవారికి కడుపుకోత!

వార్త 1 month ago

Nalgonda crime: ఆ ఇంట్లో మరికొన్ని గంటల్లో ఫలితాల పండుగ జరగాలి.. కొడుకు సాధించిన మార్కులు చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోవాలి.. కానీ విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది.

పదో తరగతి ఫలితాలు వెలువడటానికి కొన్ని గంటల ముందే ఓ విద్యార్థి ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం ఫలితాలు వచ్చేసరికి ఆ విద్యార్థి 470 మార్కులతో ఉత్తీర్ణుడవ్వడం చూసి గ్రామస్థులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also: CI Chinna Mallaiah Rape Case: మాజీ సీఐపై అత్యాచారం కేసు!

Nalgonda crime: అసలేం జరిగిందంటే?

నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామానికి చెందిన మన్నెం సైదులు, మల్లీశ్వరి దంపతుల చిన్న కుమారుడు మన్నెం జశ్వంత్ (15) నకిరేకల్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివాడు. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తండ్రి సైదులు ఇంటి ముందు ట్రాక్టర్‌ను ఉంచి పనికి వెళ్లారు. ఖాళీగా ఉన్న జశ్వంత్ ఆ ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయాలనుకున్నాడు. అయితే ట్రాక్టర్ గేర్‌లో ఉన్న విషయం తెలియక, అది స్టార్ట్ కాకపోవడంతో.. ఇంజిన్ సెల్ఫ్ మోటార్ వద్ద బ్యాటరీ కనెక్షన్‌ను సరిచేయడానికి ప్రయత్నించాడు.

ఒక్కసారిగా ట్రాక్టర్ స్టార్ట్ అయ్యి జశ్వంత్ పైకి దూసుకెళ్లింది. నాగళ్లు కిందకు దిగి ఉండటంతో, పెద్ద టైరు కింద పడిన జశ్వంత్‌ను ట్రాక్టర్ కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో నాగళ్ల మధ్య చిక్కుకుని జశ్వంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్థులు వెంటనే జశ్వంత్‌ను బయటకు తీసి నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే జశ్వంత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

రిజల్ట్స్ వచ్చాయి.. కానీ జశ్వంత్ లేడు!

జశ్వంత్ మరణించిన కొన్ని గంటలకే పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అందులో జశ్వంత్ 470 మార్కులతో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఫలితాలు చూసి సంతోషించాల్సిన తరుణంలో, ఆ చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండె పగిలేలా విలపిస్తున్నారు. మర్రూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టెన్త్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha