Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం

సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం

వార్త 2 weeks ago

Retired IPS Wife Murder updates: హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో శనివారం ఉదయం ఈ దారుణ హత్య వెలుగుచూసింది.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీహార్ మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య సునీత (65) తన నివాసంలోనే శవమై కనిపించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

Read Also :Retired IPS Wife Murder: రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్‌రే భార్య దారుణ హత్య

హత్య జరిగిన తీరు

సునీతను దుండగులు ఇంట్లోనే గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని, ఆ సమయాన్ని అనుకూలంగా మార్చుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

నిందితుడి గుర్తింపు

ఈ హత్యకు ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి (Domestic Help) కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్య జరిగిన సమయం నుండి సదరు వ్యక్తి పరారీలో ఉండటంతో, దోపిడీ కోణంలోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లోని నగదు, నగలు ఏవైనా మాయమయ్యాయా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Retired IPS Wife Murder updates: పోలీసుల దర్యాప్తు

సంఘటనా స్థలానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు. ఐఏఎస్ క్వార్టర్స్ వంటి హై-సెక్యూరిటీ జోన్‌లో ఇలాంటి ఘటన జరగడంపై అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రేమించిన పాపానికి ప్రాణం పోయింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha