Anvay Dravid: భారత క్రికెట్ దిగ్గజం, 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ క్రికెట్ వారసత్వాన్ని ఆయన చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) ఘనంగా ముందుకు తీసుకెళుతున్నాడు.
శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఈ యువ వికెట్ కీపర్-బ్యాటర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. లంకలోని మహింద రాజపక్స అంతర్జాతీయ స్టేడియం వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన అన్వయ్.. కేవలం 67 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 పరుగులు జోడించి టీమిండియా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
Read Also:Cristiano Ronaldo: ఇదే నా చివరి ప్రపంచకప్.. క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగ ప్రకటన

పీకల్లోతు కష్టాల్లో భారత్.. ‘ద్రవిడ్’ మార్క్ ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే లంక బౌలర్లు గట్టి షాకిచ్చారు. 19వ ఓవర్ ముగిసేసరికి కేవలం 81 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన 17 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్, మరో బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్ (76 పరుగులు) తో కలిసి ఇన్నింగ్స్‌ను అద్భుతంగా చక్కదిద్దాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 145 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ముఖ్యంగా అన్వయ్ ద్రవిడ్ 129.85 స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా ఆడుతూ కేవలం 47 బంతుల్లోనే తన తొలి యూత్ వన్డే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని క్లాస్ షాట్లు చూసి సెంచరీ ఖాయమనిపించినా.. శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గిమ్హాన్ మెండిస్ బౌలింగ్‌లో అన్వయ్ దురదృష్టవశాత్తూ వెనుదిరిగాడు.
Anvay Dravid: భారత్ 285 పరుగులకు ఆలౌట్.. మెండిస్ ఐదు వికెట్లు
అన్వయ్‌కు చక్కని సహకారం అందించిన అర్జున్ రాజ్‌పుత్ 81 బంతుల్లో 76 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఈ కీలక భాగస్వామ్యం విడిపోయిన తర్వాత భారత ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. 263 పరుగుల వద్ద 7వ వికెట్‌గా అన్వయ్ ఔటైన తర్వాత భారత టెయిలెండర్లు చేతులెత్తేశారు. దీంతో కేవలం 22 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి మూడు వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ 41 పరుగులిచ్చి 5 వికెట్లతో భారత్‌ను కట్టడి చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ముగిసిన ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 220 పరుగులతో అదరగొట్టిన అన్వయ్.. తాజా ప్రదర్శనతో రాబోయే అండర్-19 ప్రపంచ కప్‌నకు సెలెక్ట్ అయ్యే అవకాశాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా, అన్వయ్ అన్నయ్య సమిత్ ద్రవిడ్ కూడా ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైనప్పటికీ మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు.
Epaper: epaper.vaartha.com

