Dailyhunt

Latest News: Bigg Boss 9: కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న భరణి

వార్త 4 months ago

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) చివరి అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 12వ వారంలోకి ప్రవేశించగా, మరో మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనున్నట్టు తెలుస్తోంది.

ఈ వారం నామినేషన్స్ ఘర్షణాత్మకంగా సాగగా, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లు హౌస్‌లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. కెప్టెన్సీ కంటెండర్‌ను సెలక్ట్ చేయడానికి బిగ్ బాస్ (Bigg Boss 9) ఈ సారి వినూత్నంగా పాత సీజన్ల కంటెస్టెంట్లను రంగంలోకి దింపాడు.

Bigg Boss 9: ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్

కెప్టెన్సీ కోసం పవన్ కళ్యాణ్‌ను ఎంపిక చేసింది ప్రియాంక జైన్

కెప్టెన్సీ కోసం మొదటి కంటెండర్‌ను ఎంపిక చేయడానికి మాజీ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్ (Priyanka Jain) హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెను ఆకట్టుకునేందుకు అందరూ ప్రయత్నించినా, చివరికి ప్రియాంక పవన్ కళ్యాణ్‌ను ఎంపిక చేసింది. ఇద్దరి మధ్య జరిగిన టాస్క్‌లో పవన్ విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు.

దీంతో ఈ వారం మొదటి కెప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ (Gautam Krishna) పంచెకట్టులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తనతో పోటీపడేందుకు భరణిని ఎంపిక చేసుకున్నారు. ఈ టాస్కులో గౌతమ్ గెలవడంతో కెప్టెన్సీ రేసు నుంచి భరణి తప్పుకోవాల్సి వచ్చింది.

ఓడిపోయిన తర్వాత భరణి ఎమోషనల్ అయ్యాడు. కూతురు చెప్పిన మాటలను గుర్తుంచేసుకుంటూ బాధపడ్డాడు భరణి. ఎలాగైనా కెప్టెన్ అవ్వండి డాడీ అన్నది మైండ్ లో ఉంది కానీ.. మొన్న మిస్ అయినప్పుడే చివరకు వచ్చి పోయిందే అని బాధపడ్డా.. ఇది రాసి లేదు.. సారీ హానీ పాప.. సారీ అమ్మా అంటూ భరణి ఎమోషనల్ అయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Latest News: Bigg Boss 9: స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha