Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ రివ్యూ

'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ రివ్యూ

వార్త 3 months ago

Love Insurance Company Review: ప్రదీప్ రంగనాథన్ సినిమాలకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గత చిత్రాలు 100 కోట్ల మార్కును అందుకోవడంతో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also:Avika Gor: 'అగ్లీ స్టోరీ' షూటింగ్‌లో ఇబ్బంది పడ్డాను.. అవికా గోర్ షాకింగ్ కామెంట్స్

కథ

2040 నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అప్పటి ప్రపంచం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)' అనే యాప్‌పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎవరిని ప్రేమించాలి, ఎప్పుడు విడిపోవాలి అనేది ఆ యాప్ మాత్రమే నిర్ణయిస్తుంది. ధీమా (కృతి శెట్టి) ఈ యాప్ ఇచ్చే సూచనలను గుడ్డిగా ఫాలో అవుతుంటుంది. మరోవైపు అసలు మొబైల్ ఫోన్లు అనేవే లేని ఆర్గానిక్ వరల్డ్ నుంచి వచ్చిన వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్) ఆ యాప్‌కు వాయిస్ ఓవర్ ఇస్తుంటాడు. అతడు ధీమాను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు, కానీ యాప్‌లోని లవ్ స్కోర్ ఫీచర్ వల్ల వాళ్ల బంధంలో సమస్యలు వస్తాయి. యాప్ చెప్పిందే వేదంగా నమ్మే ధీమా.. వాసును వదిలేసి వెళ్లిపోతుంది. ప్రేమను ఒక డిజిటల్ యాప్ కొలవలేదని నిరూపించడానికి వాసు ఏం చేశాడు? వీళ్ళ మధ్యలోకి సూర్య (ఎస్‌జే సూర్య) ఎందుకొచ్చాడు..? ఆ సిస్టమ్‌ను ఎదిరించి వాసు తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ.

 Love Insurance Company

Love Insurance Company Review:కథనం

కృతి శెట్టి నటన విషయం పక్కన పెడితే, అంతకుముందు సినిమాలలో మాదిరిగా ఆమెను అందంగా చూపించలేకపోయారు. ప్రదీప్ .. ఎస్ జె సూర్య నటన ఓకే. ఫొటోగ్రఫీ ఫరవాలేదు. బాణీలు పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.

మనసులోని ప్రేమ గాఢతను కొలిచే ఒక యాప్ వస్తే ఎలా ఉంటుంది? అనే విఘ్నేశ్ శివన్ ఆలోచన బాగానే అనిపిస్తుందిగానీ, ఆ ఆలోచనకు దృశ్య రూపాన్ని ఇవ్వడంలో ఆయన పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఈ కథ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడుతుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రామ్ చరణ్ - నాగవంశీ క్రేజీ కాంబో: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మెగా మూవీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha