Ram Charan Sukumar Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో అత్యంత పటిష్టమైన లైనప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది.
ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా, గురించి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also:Director Saailu Kampati Next Movie: రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్
సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ కాంబో
'పెద్ది' తర్వాత రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరూ జతకడుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mega Power Star Upcoming Movies
Ram Charan Sukumar Movie Update: మెగా ఫ్యాన్స్‌లో జోష్
వరుసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలను లైన్‌లో పెడుతున్న రామ్ చరణ్, గ్లోబల్ స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ‘పెద్ది’తో సక్సెస్ అందుకుని, సుకుమార్ సినిమాతో ఆ జోరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను నిర్మించబోతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
నితిన్ కొత్త సినిమా ప్రారంభం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో క్రేజీ ప్రాజెక్ట్

