Lavanya Tripathi: సతీ లీలావతి పూర్తిగా వినోదాత్మక చిత్రం

Lavanya Tripathi: సతీ లీలావతి పూర్తిగా వినోదాత్మక చిత్రం

వార్త

వార్త

54d

Loading...

లావణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi), దేవ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సతీ లీలావతి'. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగ మోహన్ నిర్మించిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా 'సతీ లీలావతి' రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌ను నిర్వహించారు.

Karnataka: తమన్నా ఎంపిక వెనుక అసలు కారణాలు చెప్పిన మంత్రి

నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు

ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మాట్లాడుతూ.. తన కుటుంబం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే తాను ఊరుకోనని అన్నారు.'సతీ లీలావతి' సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. సప్తగిరితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అందరూ గొప్ప ఆర్టిస్టులు నటించారు. దేవ్ మోహన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా ఎంటర్టైనింగ్ మూవీ. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.

పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని లావణ్య త్రిపాఠి అన్నారు.'ఫస్ట్ డే షూటింగ్ లో ఒక యాక్షన్‌ సీన్ ప్లాన్‌ చేశారు. నాకు భయమేసింది. డైరెక్టర్‌ దగ్గరకు వెళ్లి నేను ప్రెగ్నెంట్‌ అని చెప్పా. ఆయన షాక్‌ అయ్యారు. అప్పటివరకూ ఎవరికీ ఈ విషయం తెలియదు. ఆ తర్వాత కూడా ఎవరికీ చెప్పలేదు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రెగ్నెన్సీతోనే సినిమా మొత్తం పూర్తి చేశా' అని లావణ్య చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Mahesh Babu: 'యుఫోరియా'పై సూపర్ స్టార్ ప్రశంసలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha