Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లేడీస్ హాస్టల్ లో విద్యార్థినులపై ఓనర్ కొడుకు కిరాతక దాడి

లేడీస్ హాస్టల్ లో విద్యార్థినులపై ఓనర్ కొడుకు కిరాతక దాడి

వార్త 2 days ago

UP crime: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక లేడీస్ హాస్టల్లో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. హాస్టల్ గదిలోకి అక్రమంగా చొరబడిన యజమాని కుమారుడు, అక్కడున్న ఇద్దరు అమ్మాయిలపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల రక్షణపై మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : Bihar incident: బీహార్‌లో ఘోర విషాదం.. మహానంద నది ఉధృతికి నలుగురు పిల్లలు బలి

UP crime: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ ఘాతుకం.. వీడియో వైరల్!

ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లోని శంకర్ ఘాట్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో చోటుచేసుకుంది. వీడియోలో నిందితుడు గదిలోకి ప్రవేశించి ఇద్దరు అమ్మాయిలను నిర్దాక్షిణ్యంగా కొట్టడం కనిపిస్తోంది. అంతేకాకుండా, వారిలో ఒక అమ్మాయి జుట్టు పట్టుకుని గది వెలుపలికి ఈడ్చుకెళ్తుండగా, అక్కడే ఉన్న ఒక వృద్ధురాలు అతనిని ఆపేందుకు ప్రయత్నిస్తోంది. హాస్టల్ యజమాని కొడుకు తమను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నాడని, తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత యువతులు కన్నీరుమున్నీరయ్యారు.

అసలేం జరిగిందంటే?

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 18న జరిగిన ఈ ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు తీవ్ర మద్యం మత్తులో హాస్టల్ యువతులకు తరచూ ఫోన్ కాల్స్, అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తూ వేధించేవాడు. ఈ క్రమంలోనే బాధిత అమ్మాయిలు అతని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు నేరుగా వారి రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు గట్టిగా బాదడం ప్రారంభించాడు. భయంతో తాము తలుపులు తీయకపోవడంతో, నిందితుడు బయట నుంచి గదికి తాళం వేశాడు. ఆ సమయంలో తాము గదిలో ఉండి గట్టిగా కేకలు వేసినా ఎవరూ తలుపు తీయలేదు. కాసేపటికి అతని తల్లి అక్కడికి చేరుకుని తాళం తీయగా.. నిందితుడు వెంటనే లోపలికి దూసుకొచ్చి తీవ్రమైన బూతులు తిడుతూ మాపై దాడికి తెగబడ్డాడు.

ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అధినేతలకు ప్రధాని మోదీ అరుదైన గిఫ్ట్స్.. లడఖీ స్టోల్, కేసర్ మామిడి పండ్లు బహుమతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha