Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లేగదూడలపై పులి పంజా..పోలవరం జిల్లాలో 13 ఆవుదూడలు హతం

లేగదూడలపై పులి పంజా..పోలవరం జిల్లాలో 13 ఆవుదూడలు హతం

వార్త 2 months ago

Polavaram news:పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగవరం గ్రాములో బుధవారం తెల్ల వారుజామున పశువుల పాకపై రాయల్ బెంగాల్ టైగర్ మెరుపు దాడి చేసి పంజా విసిరింది.

పెద్ద పులి దాడిలో మొత్తం 13 లేగ దూడలు మృతి చెందాయి. ప్రాణాలు కోల్పోయిన దూడలకోసం తల్లి ఆవుల అక్రందన చూరులను సైతం కంటతడి పెట్టిస్తుంది. పెద్ద పులి వరుస దాడులతో గిరిజన గ్రామాల్లో అలజడి మొదలైంది. పులిని కట్టడి చేయటానికి రిస్క్యు బృందాలు సైతం రంగంలోకి దిగాయి. మైదాన ప్రాంతంలో పట్టుకున్న పులిని పాపికొండల అభయారణ్యంలో ప్రాంతంలో వదలటంతో అడవి నుండి బయటకు వస్తున్న పులి సమీపంలో ఉన్న గిరిజన గ్రామాల్లో పశువులపై దాడి చేసి హతమారుస్తుంది. పులి దాడులతో పశువులతో పాటు తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆకలేసినప్పుడు మాత్రమే ఆవులను చంపి తినేది. కేవలము రెండు మూడు రోజులకు మాత్రమే ఒక పశువును చంపేది. నాలుగు నెలల పాటు ఇదే పందాను అనుసరించిన పెద్దపులి తన పందా మార్చింది. గత నెల రోజులుగా పశువులపై దాడి చేసి మూకుమ్మడిగా చంపి వేస్తోంది. తమ పశు సంపదను పెద్దపులి చంపి వేస్తుంటే అటవీ శాఖ అధికారులు కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల విలువ వేలరూపాయలు ఉంటే కేవలం కొద్ది మాత్రమే పరిహారము చెల్లిస్తున్నారని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పెద్దపులి మేడకు అటవీ అధికారులు జి పి ఎస్ ట్రాకర్అమర్చారు. దీంతో ఎంత దట్టమైన అడవిలో ఉన్నప్పటికీ పులి కదలికలు అధికారులకు సులువుగా తెలిసిపోతున్నాయి.

Read also:AP Heatwave: ఏపీలో 45 డిగ్రీల సెగ.. నేడు 46 మండలాల్లో డేంజర్ బెల్స్!

 Royal Bengal tiger attack in Polavaram

Polavaram news:మారుతున్న పులి ప్రవర్తన

పులిని బంధించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సైతం రంగంలోకి దింపామని అటవీ అధికారులు రోజు చెప్తున్నారు. అలాగే రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి అటవీ అధికారులు పులి వెనుకే ప్రయాణం సాగిస్తున్నారు. పులి ఉనికిని చెబుతూ ప్రజలను అప్రమత్తం చేయటం మినహా గత నాలుగు నెలలుగా చేసింది ఏమీ లేదని ఆదివాసీలు పెదవి విరుస్తున్నారు. మైదాన ప్రాంతంలో స్వల్ప కాలంలోనే పులిని బంధించగలిగిన అటవీ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో పులిని బంధించడంలో ఎందుకు విఫలమవుతున్నారు అనేది వేలడాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. పులిని బంధించేందుకు ఈ నాలుగు నెలల కాలంలో ప్రభుత్వానికి కొన్ని లక్షల రూపాయల ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లభించలేదు. పులి వైఖరిలో వచ్చిన మార్పుతో రాబోయే రోజుల్లో మనుషులపై దాడి చేస్తే పరిస్థితి ఏంటా? అని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే పులి మనుషులపై దాడి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం పులిని సురక్షితంగా వెంటనే బందించమని అటవీ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 14న ఈ పులిని మైదాన ప్రాంతంలో నుండి తీసుకువచ్చి పాపికొండల సమీపంలో వదిలిపెట్టారు. అప్పటినుండి ఈబెంగాల్ టైగర్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అటు మైదాన ప్రాంతం ఇటు ఏజెన్సీ ప్రాంతాన్ని కలియ తిరుగుతూ షికారు చేస్తోంది. పులి దాడులలో పశుసంపదను కోల్పోతున్న రైతులు ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఎంతోకొంత పరిహారం చెల్లించి చేతులు దులుపుకొని ముందుకు సాగిపోవడం తప్ప అటవీ అధికారులు చేసిందేమీ కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం గంగావరం గ్రామాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారులు పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, మత్తుమందు ప్రయోగానికి అనువైన అవకాశాన్ని గుర్తించేందుకు 6 ర్యాపిడ్ రెస్క్యూ టీమ్లు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్రాంక్విలైజింగ్బృందాలు, 2 డ్రోన్ బృందాలు, 1 కేజ్ బృందం, 1 వన్యప్రాణి అంబులెన్స్ బృందం మరియు ఫ్రంటైన్ సిబ్బందితో కూడిన 19 హనుమాన్ బృందాలు సమన్వయంతో పనిచేస్తు న్నాయని, అన్ని బృందాలు అత్యంత అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని, పులిని త్వరితగతిన బంధించేందుకు అటవీ శాఖ 200 మందికి పైగా అధికారులు, సిబ్బందిని మోహరించి యుద్ధప్రాతిపదికన చర్యలు చెపట్టింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పిఠాపురం యువతకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్.. ఈ నెల 6న మెగా జాబ్ మేళా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha