Asha Bhosle: భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ధ్రువతారగా వెలిగిన లెజెండరీ సింగర్, ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ఆమెకు నిన్న గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు.
ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ నేడు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆశా భోంస్లే మరణవార్త తెలియగానే చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also:Monalisa Marriage Dispute: అజ్ఞాతంలోకి వెళ్లిన మోనాలిసా జంట
Asha Bhosle: లతా మంగేష్కర్ సోదరిగా.. స్వయంకృషితో శిఖరానికి..
సుమారు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె 20కి పైగా భాషల్లో 12 వేల కంటే ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా.. మెలోడీలు, పెప్పీ సాంగ్స్, గజల్స్, భజనలులో తనదైన ముద్ర వేశారు. ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి శేవంతి మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదికర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్, మనవరాలు జనాయ్ భోస్లే ఉన్నారు.
Asha Bhosle Passes Away
ఏడు సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు అందుకున్నారు. ఆమె పదిహేడు మహారాష్ట్ర రాష్ట్ర అవార్డులను అందుకున్నది. భారత సినీ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే ఒక శిఖరం లాంటివారు. 1943లో మరాఠీ చిత్రం 'మాఝా బల్'తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, 1948లో హిందీ చిత్రం 'చునరియా'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో దాదాపు 12,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆర్.డి. బర్మన్, ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్ వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు.
నటిగా కూడా
ఆమె సంగీత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000లో అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. వీటితో పాటు ఆమె అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. గాయనిగానే కాకుండా 2013లో 'మాయ్' అనే మరాఠీ చిత్రంలో నటిగా కూడా కనిపించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

