Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎట్టకేలకు ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' ఈరోజు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.
విడుదలైన మొదటి ఆట నుంచే ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన సానుకూల స్పందన (పాజిటివ్ టాక్) లభిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో అఖిల్ సరసన టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది.
మురళీ కిషోర్ మేకింగ్.. అఖిల్ మాస్ లుక్‌కు థియేటర్లలో ఈలలు!
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అఖిల్ సరికొత్త మాస్ మేకోవర్, ఆయన నటన వెండితెరపై అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. చాలారోజల తర్వాత అఖిల్ కెరీర్‌లో ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ పడటంతో అక్కినేని అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు.
Akhil Akkineni: తండ్రి నాగార్జున కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న అఖిల్..
‘లెనిన్’ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో హీరో అఖిల్ తన సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో తన తండ్రి, కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి అఖిల్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘ కాలం తర్వాత లభించిన ఈ బిగ్గెస్ట్ సక్సెస్‌తో అఖిల్ తీవ్ర భావోద్వేగానికి (Emotional) లోనయ్యారు. ఆనందంతో తండ్రి నాగార్జున కాళ్లకు నమస్కరించి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. కొడుకు విజయాన్ని చూసి నాగార్జున ముఖంలోనూ ఎనలేని ఆనందం కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

