Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నటి రుక్మిణి వసంత్ మార్ఫింగ్ ఫోటోల కేసులో ముగ్గురు అరెస్ట్

నటి రుక్మిణి వసంత్ మార్ఫింగ్ ఫోటోల కేసులో ముగ్గురు అరెస్ట్

వార్త 2 weeks ago

Actress Rukmini Vasanth: 'కాంతార చాప్టర్ 1' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ కేసులో కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

AI సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ, నటి అశ్లీల చిత్రాలు, వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి.

Read Also : Vanda Devullu Review: 'వంద దేవుళ్ళు' సినిమా రివ్యూ

 Three arrested in actress Rukmini Vasanth morphed photos case.

Actress Rukmini Vasanth: నిందితుల వివరాలు, సెక్షన్ల నమోదు

ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన రవికుమార్ (24), బెంగళూరు కామాక్షిపాళ్యకు చెందిన చంద్రకాంత్ (33), నాగసంద్రకు చెందిన రంజిత్ (25)గా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నిందితులపై సమాచార సాంకేతిక చట్టం (IT Act)తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

మే నెలలో వైరల్ అయిన నకిలీ చిత్రాలు

గత మే నెలలో నటి రుక్మిణి వసంత్ బికినీ ధరించినట్లు ఉన్న కొన్ని అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. అయితే, అవి కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో సృష్టించిన నకిలీ చిత్రాలని తేలింది. వేరొకరి శరీరానికి తన ముఖాన్ని అతికించి, తన వ్యక్తిగత ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించేలా ఈ ఫోటోలను మార్ఫింగ్ చేశారని రుక్మిణి వసంత్ సైబర్ క్రైమ్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఇటువంటి నకిలీ కంటెంట్‌ను ఎవరూ నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని ఆమె తన అభిమానులను, నెటిజన్లను కోరారు.

నటి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ అశ్లీల కంటెంట్‌ను మొదటగా పోస్ట్ చేసిన, అలాగే విస్తృతంగా షేర్ చేసిన 29 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ విచారణలో భాగంగానే తాజాగా ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి కేసులో కీలక పురోగతి సాధించారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ఏఐ సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేయడంపై పౌర సమాజంలో, సినిమా పరిశ్రమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కోర్టుకు రావాల్సిందే.. అల్లు అర్జున్ కు కోర్ట్ ఆదేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha