Lokesh Kanakaraj DC : లోకేష్ కనకరాజ్ ప్రధాన పాత్రలో, వామికా గబ్బి మరియు సంజనా కృష్ణమూర్తి నటిగా అరున్ మతీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం DC. సన్ పిక్చర్స్ (Sun Pictures) పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద (Lokesh Kanakaraj DC) అద్భుతమైన విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతోంది.
లీడ్ యాక్టర్‌గా తొలి అడుగు :
విడుదలైన కేవలం 2 వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్‌ను దాటేసి భారీ విజయంగా నిలిచింది. శరత్ చంద్ర చటోపాధ్యాయ క్లాసిక్ నవల ‘దేవదాస్’ ఆధారంగా, సరికొత్త గ్యాంగ్‌స్టర్ మరియు రివెంజ్డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఎలాగు సక్సెస్ అందుకున్నాడు కాబట్టి లోకేష్ డైరెక్షన్ తో పాటు సినిమాల్లో నటించడం కూడా చేస్తాడని చెప్పొచ్చు. ఐతే లోకేష్ తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. డీసీ తర్వాత పూర్తిగా అల్లు అర్జున్ సినిమాకే లోకేష్సమయం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ దశలో ఉందని సమాచారం.
దర్శకుడిగా ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన లోకేష్ కనకరాజ్, ఈ సినిమాతో పూర్తి స్థాయి లీడ్ యాక్టర్‌గా తొలి అడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన నటనకు, ముఖ్యంగా అరున్ మతీశ్వరన్ టేకింగ్‌కు, అనిరుధ్ రవిచందర్అం దించిన సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

