Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోకేష్ పై మోడీ ప్రశంసలు

లోకేష్ పై మోడీ ప్రశంసలు

వార్త 2 weeks ago

Modi-Lokesh : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తిరుగు ప్రయాణమైన వేళ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు విశేషమైన గుర్తింపు దక్కింది.

ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికే క్రమంలో మోదీ అత్యంత ఆప్యాయంగా లోకేష్ భుజాన్ని తట్టి ఆయన పనితీరును అభినందించారు. “నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శభాష్, భవిష్యత్తులో కూడా ఇదే వేగం మరియు స్ఫూర్తితో నీ బాధ్యతలు నిర్వర్తించాలి” అంటూ ప్రధాని స్వయంగా ప్రోత్సహించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణగా మారింది. కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న లోకేష్‌కు సాక్షాత్తూ దేశ ప్రధాని స్థాయి వ్యక్తి నుంచి ఈ తరహా ప్రశంసలు దక్కడం ఆయనకు మరింత ఉత్సాహాన్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలోనూ లోకేష్ కృషికే మోదీ కితాబు.. యువ నాయకత్వానికి దక్కిన గౌరవం

ప్రధాని నరేంద్ర మోదీ యువ నేత నారా లోకేష్‌ను అభినందించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో మోదీ పర్యటించినప్పుడు, ఆయా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో లోకేష్ కనబరిచిన సమన్వయ తీరును, అంకితభావాన్ని ప్రధాని అప్పట్లోనే ప్రత్యేకంగా కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి సాధనలో యువ నాయకత్వం ఎంత చురుగ్గా పనిచేస్తోందన్న దానికి మోదీ తాజా ప్రశంసలు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేయాలని శ్రమిస్తున్న లోకేష్‌కు ప్రధాని నుంచి లభించిన ఈ ప్రోత్సాహం ఆయనలో మరింత బాధ్యతను పెంచుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతికి ఆయన మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తారని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

జగన్ అనని మాటలను అన్నట్లు ప్రచారం చేస్తున్నారు - సజ్జల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha