Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లొకేషన్ ట్రేస్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

లొకేషన్ ట్రేస్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

వార్త 1 week ago

Mahabubnagar news:లొకేషన్ ట్రేస్ చేసి.. ఆత్మహత్యాయత్నాన్ని ఆపేసి.. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన రాజాపూర్ పోలీసులు. అభినందించిన ఎస్పీ జానకి ధరావత్, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజులాగే సోమవారం అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్ సిబ్బంది అప్రమత్తతతో ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు.

సోమవారం అర్దరాత్రి సుమారు 1.00 గంటల సమయంలో రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన టంకరి రాజేష్ తండ్రి యాదయ్య కుటుంబ కలహాల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయి తన భార్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన అతని భార్య తన ఇద్దరు చిన్న పిల్లలతో కంగారుగా వెతుకుతుండగా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పీసీ-1170 సత్యనారాయణ గౌడ్ ఆమెను గమనించి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఆమె వద్ద నుంచి రాజేష్ మొబైల్ నంబర్ సేకరించి రాజాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కు తెలుపగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అతని లొకేషన్‌ను గుర్తించారు.

Read also: Telangana school uniforms: తెలంగాణ బడుల్లో కొత్త యూనిఫామ్స్ అమలు

Mahabubnagar news:సాంకేతికతతో లొకేషన్ గుర్తింపు

అనంతరం పెట్రోలింగ్ సిబ్బంది అయిన పీసీ-1170 సత్యనారాయణ గౌడ్, హోంగార్డ్-639 ఖాజా ఖలీముద్దీన్ మరియు పెట్రోల్ మొబైల్ హోంగార్డ్-665 డ్రైవర్ నరేందర్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న రాజేష్‌ను సురక్షితంగా కాపాడి, కౌన్సెలింగ్ అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సమయస్ఫూర్తితో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన రాజాపూర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.జానకి అభినందిస్తూ, ఇలాంటి మానవతా దృక్పథంతో విధులు నిర్వహించడం పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత ఒత్తిళ్లు జీవితానికి ముగింపు కావు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్య అనేది శాశ్వత పరిష్కారం కాదు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించండి. సమయానికి తీసుకున్న ఒక నిర్ణయం విలువైన ప్రాణాలను కాపాడుతుంది.

Epaper: epaper.vaartha.com

నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha