IPS Trainee Uday Krishna: హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ (SVP NPA)లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు.
తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ప్రస్తుతం తన సొంత ఊరైన ఊళ్లపాలెంలోనే ఉన్నానని వెల్లడించారు. తన నాన్నమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతోనే సొంతూరుకు వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, విచారణాధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని ప్రకటించారు. పోలీసులు వెతికిన ప్రదేశాలు కేవలం తన తాత్కాలిక చిరునామాలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువ వివరాలు మాట్లాడలేనని, త్వరలోనే విచారణ అధికారుల ముందు హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
IPS Trainee Uday Krishna:ఎక్కడికీ పారిపోలేదు.. విచారణకు సహకరిస్తానన్న ట్రైనీ ఐపీఎస్

నేపథ్యానికి వస్తే.. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.
రాక్షసత్వానికి పరాకాష్ట: భార్యను ఉరివేసి చంపి.. ప్రాణాలు పోతుంటే కన్నవారికి వీడియో కాల్

