Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోక్‌సభలో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి బిల్లు ఆమోదం!

లోక్‌సభలో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి బిల్లు ఆమోదం!

వార్త 2 weeks ago

MSME Amendment Bill 2026: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల హోరు కొనసాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును చట్టసభల్లో ఆమోదింపజేసుకుంది.

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ (సవరణ) బిల్లు, 2026 [MSME Development (Amendment) Bill, 2026] కు లోక్‌సభ శుక్రవారం (ఆగస్టు 7, 2026) రోజున ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇప్పటికే ఆగస్టు 3న రాజ్యసభలో ఆమోదం పొందింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ‘చెల్లింపుల ఆలస్యాన్ని’ (Delayed Payments) అరికట్టడం మరియు వివాదాల వేగవంతమైన పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర MSME శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు.

Read Also :E20 పెట్రోల్ విషయంలో ఉద్యమానికి సిద్ధం అంటున్న రాహుల్

MSME Amendment Bill 2026: ఎంఎస్‌ఎంఈ సవరణ బిల్లు-2026 ప్రధాన అంశాలు

  1. TReDS ద్వారానే చెల్లింపులు తప్పనిసరి:కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSEs) చిన్న తరహా పరిశ్రమల (MSME) నుండి కొనుగోలు చేసే వస్తువులు లేదా సేవల ఇన్‌వాయిస్‌లను ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (TReDS) డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే చెల్లించడాన్ని తప్పనిసరి చేశారు. దీనివల్లMSMEలకు వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తగ్గనున్నాయి.
  2. 90 రోజుల్లోగా వివాదాల పరిష్కారం:మధ్యవర్తిత్వం ఫలించకపోతే 30 రోజుల్లోగా ఆర్బిట్రేషన్‌కు పంపాలి. అలాగే ప్లీడింగ్స్ పూర్తయిన రోజు నుండి 90 రోజుల్లోగా వివాదంపై తుది అవార్డు/తీర్పును వెలువరించాల్సి ఉంటుంది.
  3. 50% మధ్యంతర చెల్లింపులు:ఎంఎస్‌ఎంఈ రికవరీ ఆర్డర్‌ను సవాలు చేస్తూ కొనుగోలుదారుడు వేసిన పిటిషన్ ఆరు నెలలకు పైగా కోర్టులో పెండింగ్‌లో ఉంటే, వివాదాస్పద మొత్తంలో కనీసం 50% సొమ్మును సంబంధిత ఎంఎస్‌ఎంఈ సప్లయర్‌కు చెల్లించాలని కోర్టులను అధికారికంగా సన్నద్ధం చేశారు.
  4. చిన్న లోపాల డీక్రిమినలైజేషన్:రిజిస్ట్రేషన్ సంబంధిత చిన్నపాటి సాంకేతిక లోపాలను, నియమ ఉల్లంఘనలను క్రిమినల్ నేరాలుగా కాకుండా కేవలం జరిమానాలు (Penalties) విధించేలా సవరించారు. దీనితో పరిశ్రమల యాజమాన్యాలకు క్రిమినల్ విచారణ భయం తప్పుతుంది.
  5. ల్యాండ్ రెవెన్యూ బాకీలుగా రికవరీ:సమస్య పరిష్కార ఒప్పందాలు, ఆర్బిట్రల్ అవార్డుల ప్రకారం రాబట్టాల్సిన బకాయిలను ‘ల్యాండ్ రెవెన్యూ బాకీలు’గా భావించి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వేగంగా రికవరీ చేసే సదుపాయం కల్పించారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు లేనట్లేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha