Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లొల్లి చేస్తే భయపడేది లేదు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ సీరియస్‌ వార్నింగ్‌

లొల్లి చేస్తే భయపడేది లేదు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ సీరియస్‌ వార్నింగ్‌

వార్త 3 weeks ago

Gaddam Prasad Kumar: తెలంగాణ శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. వివిధ ప్రజా సమస్యలపై నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టడంతో సభలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హెచ్చరిక

సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు ఆందోళన విరమించి శాసనసభ సంప్రదాయాలను పాటించాలని కోరుతూ, ‘మీరు లొల్లిపెడితే నేను భయపడను, మీరు ఇలా చేయడం పూర్తిగా తప్పు’ అని గట్టిగా హెచ్చరించారు.

Gaddam Prasad Kumar: మంత్రి శ్రీధర్ బాబు స్పందన, హామీ

సభలో జరిగిన గందరగోళంపై మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపై తమకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. వారిపై జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నామని, సీఎం దీనిపై నివేదిక కోరారని తెలిపారు. ఆ నివేదిక రాగానే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.

1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha