Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లూజ్ టీ తాగుతున్నారా? అయితే అలర్ట్.. ఇంట్లోనే కల్తీని గుర్తించే చిట్కాలు ఇవే

లూజ్ టీ తాగుతున్నారా? అయితే అలర్ట్.. ఇంట్లోనే కల్తీని గుర్తించే చిట్కాలు ఇవే

వార్త 5 days ago

Loose Tea : భారతీయుల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల దైనందిన జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టీ ఒక అంతర్భాగంగా మారిపోయింది. అయితే, ప్రస్తుతం విడిగా అమ్మే 'లూజ్ టీ' (Loose Tea) లో జరుగుతున్న కల్తీల వ్యవహారం వినియోగదారుల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

మార్కెట్‌లో లభించే నాణ్యత లేని లూజ్ టీ వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుండటంతో, ప్రముఖ బ్రాండ్ 'టాటా టీ చక్ర గోల్డ్ జెమిని' ఈ కల్తీ సమస్యపై ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. వ్యాపారులు తమ లాభాలను పెంచుకోవడానికి టీ పొడి బరువు పెంచేలా ఇసుక, పిండిపదార్థాలు, రసాయన రంగులు మరియు ఇప్పటికే వాడేసిన టీ ఆకులను తిరిగి ప్రాసెస్ చేసి లూజ్ టీలో కలుపుతున్నారు. ఈ నాసిరకం పదార్థాల వల్ల కేవలం టీ రుచి మారడమే కాకుండా, తేలికపాటి జీర్ణసంబంధిత సమస్యల నుండి ప్రాణాంతకమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వరకు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also ; ప్రొటీన్ పౌడర్ అధికంగా తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కల్తీని గుర్తించే సులభమైన మార్గాలు

పరిమితమైన క్వాలిటీ చెక్స్, సరైన ప్యాకేజింగ్ లేకపోవడం వల్లే లూజ్ టీ ఎక్కువగా కల్తీకి గురవుతుందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పష్టం చేసింది. అయితే, ల్యాబ్‌లకు వెళ్లకుండానే వినియోగదారులు ఇంట్లోనే సులభంగా కల్తీ టీని గుర్తించేందుకు కొన్ని పద్ధతులను ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. అందులో ఒకటైన 'చల్లటి నీటి పరీక్ష' (Cold Water Test) ద్వారా ఒక గ్లాసు చల్లటి నీటిలో కొద్దిగా టీ పొడి వేసినప్పుడు లేదా తడి ఫిల్టర్ పేపర్‌పై ఉంచినప్పుడు, అది తక్షణమే రంగును విడుదల చేస్తే అందులో కృత్రిమ రంగులు కలిపినట్లు అర్థం చేసుకోవాలి. అదే స్వచ్ఛమైన టీ అయితే చాలా నిమ్మళంగా రంగును విడుదల చేస్తుంది. అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయల నుండి సేకరించిన అత్యుత్తమ టీ ఆకులతో లభించే ‘టాటా టీ చక్ర గోల్డ్ జెమిని’ లాంటి విశ్వసనీయ బ్రాండ్లనే ఎంచుకోవడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన టీని ఆస్వాదించవచ్చని మరియు కల్తీ రహిత సమాజానికి మద్దతు ఇవ్వవచ్చని ఈ అవగాహన కార్యక్రమం ద్వారా బ్రాండ్ ప్రతినిధులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha