Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మా ఓపెనర్లకు బౌలింగ్ చేయనందుకు సంతోషం:కమిన్స్

మా ఓపెనర్లకు బౌలింగ్ చేయనందుకు సంతోషం:కమిన్స్

వార్త 3 weeks ago

Pat Cummins: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ముంబై ఇండియన్స్‌పై సాధించిన ఘనవిజయం అనంతరం కెప్టెన్ పాట్ కమిన్స్ తన జట్టు ప్రదర్శనపై, మారుతున్న ఐపీఎల్ ట్రెండ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also: IPL 2026 : నేడు GT vs RCB ల మధ్య కీలక మ్యాచ్..!!

ముంబైపై ఆరో విజయం

వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 6 వికెట్ల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్‌కు ఇది సీజన్‌లో వరుసగా ఐదో విజయం కాగా, మొత్తంగా ఆరోది. ఈ విజయంపై కమిన్స్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.మొదట్లో ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమనిపించినా, పిచ్ బాగుండటం మరియు తమ బ్యాటింగ్ లైనప్‌పై ఉన్న నమ్మకంతో గెలిచామని కమిన్స్ తెలిపారు.ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల నిర్భయమైన ఆటతీరును ఆయన కొనియాడారు.

Pat Cummins: కోచింగ్ సిబ్బందికి కూడా క్రెడిట్ ఇవ్వాలి

వారిద్దరికీ బౌలింగ్ చేయాల్సిన అవసరం లేనందుకు తాను సంతోషంగా ఉన్నానని సరదాగా వ్యాఖ్యానించారు. యువ ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారని కితాబు ఇచ్చాడు. సలీల్ (అరోరా)కు ఈ సీజన్‌లో ఇంకా పెద్దగా అవకాశం రాలేదు, కానీ ప్రీ-సీజన్‌లో బాగా ఆకట్టుకున్నాడు. వాళ్లందరిలో ఆ నిర్భయ వైఖరి ఉంది. కాబట్టి ఈ యువకులలో ఆ వైఖరిని నింపినందుకు కోచింగ్ సిబ్బందికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లు ఎంత గొప్పవాళ్ళో వాళ్లకు తెలియదని నేను అనుకుంటున్నాను. అని కమిన్స్ అన్నాడు.

ఐదేళ్లలో మారిన ఐపీఎల్

గతంతో పోలిస్తే ఐపీఎల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని కమిన్స్ అభిప్రాయపడ్డారు.ఐదేళ్ల క్రితం 200 పరుగులు ఛేజ్ చేయడం కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఓవర్‌కు 12 పరుగులు చేయాల్సి ఉన్నా బ్యాటింగ్ యూనిట్‌గా నమ్మకంతో ఛేజ్ చేస్తున్నామని చెప్పారు.ఇవి ఎక్కువ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లు కాబట్టి బౌలర్లకు పెద్దగా అవకాశం ఉండదని, అందుకే బౌలర్ల పట్ల తనకు సానుభూతి ఉందని పేర్కొన్నారు.జట్టులోని ఈషాన్ (మలింగ) అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, అతను పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉండటం జట్టు విజయాలకు ప్రధాన కారణమని కమిన్స్ కితాబిచ్చారు.

 Pat Cummins Post Match Presentation MI vs SRH

యువ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్

సలీల్ అరోరా వంటి యువ ఆటగాళ్లు ప్రీ-సీజన్‌లో ఆకట్టుకున్నారని, యువకులలో నిర్భయమైన వైఖరిని నింపిన కోచింగ్ సిబ్బందికి క్రెడిట్ దక్కుతుందని కమిన్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం అంతా బాగానే జరుగుతోందని, ఈ జోరును ఇలాగే కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఎస్‌ఆర్‌హెచ్‌తో ఓటమిపై హార్దిక్ పాండ్యా ఎమోషనల్ కామెంట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha