Dailyhunt
Maa Inti Bangaram Release: 'మా ఇంటి బంగారం' విడుదల తేదీ ఫిక్స్

Maa Inti Bangaram Release: 'మా ఇంటి బంగారం' విడుదల తేదీ ఫిక్స్

వార్త 1 month ago

Maa Inti Bangaram Release: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం' విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వేసవిలో సమంత తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు.

Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్

ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్.. తలుపు చాటున 'బంగారం'

కొత్త పోస్టర్‌లో సమంత ఓ తలుపు చాటు నుంచి ఆసక్తిగా తొంగిచూస్తూ కనిపించారు. ఈ పోస్టర్‌ను పంచుకుంటూ, 'ఈ వేసవిలో థియేటర్లలో కలుద్దాం, బంగారాలు.. మే 15న 'మా ఇంటి బంగారం'ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది' అని ఆమె క్యాప్షన్ జోడించారు.నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను జనవరిలో విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. బస్సులో బ్రౌన్ కలర్ చీరలో నిలబడి, పోరాటానికి సిద్ధమైనట్లుగా ఉన్న సమంత లుక్ సినిమాపై అంచనాలను పెంచింది.

ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ, 'ఇది కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే ఎమోషనల్ కథ. ఒక మహిళ బలం ఆమె ధైర్యం నుంచే కాదు, బలహీనత నుంచి కూడా వస్తుందని ఈ చిత్రం చెబుతుంది. ఈ పాత్రలో నటించడం, నిర్మాతగా ఈ సినిమాను నిర్మించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది' అని తెలిపారు. సరదాగా, ఉత్కంఠగా సాగే ఈ కథ ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.కాగా, సమంత తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై భర్త రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

70th Filmfare Awards: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha