Macharla Crime: పల్నాడు జిల్లా మాచర్లలో చోటుచేసుకున్న అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇంట్లోకి చొరబడి ఓ మహిళా ఉద్యోగినిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఉదంతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
నిందితుడిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆయన ఆదేశించారు.
Read Also:Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
Macharla Crime: పోలీసుల దర్యాప్తు పురోగతి
పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్టు అధికారులు వివరించారు.
అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఘటనకు సంబంధించి కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పాలని సీఎం ఆదేశించారు.
AP CM Chandrababu Naidu reacts to Macharla woman
అసలేం జరిగింది?
బాధితురాలు సత్తెనపల్లికి చెందిన వారు కాగా, ఉద్యోగ రీత్యా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఏడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమెపై, ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు.శుక్రవారం నాడు బాధితురాలు తన స్వగ్రామమైన సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.
సాయంత్రం సమయంలో ఎవరో తలుపు తట్టడంతో ఆమె తలుపులు తెరిచారు. వెంటనే లోపలికి ప్రవేశించిన నిందితుడు కత్తితో ఆమెను బెదిరించి భయాందోళనకు గురిచేశాడు. అనంతరం ఆమె చున్నీతోనే కాళ్లు, చేతులు కట్టేసి నోరు నొక్కేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

