Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

వార్త 2 months ago

Perni Nani: మచిలీపట్నం వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. గురువారం మచిలీపట్నం, కొబ్బరితోట ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారు.

అక్రమ ఇంటి నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. దీంతో తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్న పేర్ని నాని అధికారులపై చిందులు తొక్కారు. అధికారులను, పోలీసులను తీవ్రంగా బెదిరించారు. దీంతో పోలీసు అధికారుల సంఘం చిలకలపూడి పీఎస్లో పేర్ని నానిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Read Also: Tirupati: భక్తి శ్రద్దలతో నగర సంకీర్తన..

 Case Registered Against YCP Leader in Machilipatnam

Perni Nani: అవినీతి పోలీసులను ప్రశ్నిస్తూనే ఉంటాం

అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను నిలదీస్తూనే ఉంటామని, అక్రమ కేసులతో మా పోరాటాన్ని ఆపలేరని వైయస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) పట్ల అనుచితంగా వ్యవహరించిన సీఐ తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మచిలీపట్నంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, పెనమలూరు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వకర్తలు చక్రవర్తి, ఉప్పాల రమేష్ (రాము), పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టీటీడీకి రూ.10.10 లక్షలు విరాళం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha