Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాదాపూర్ లో హత్య : విడాకుల కక్షతోనే ఘాతుకం

మాదాపూర్ లో హత్య : విడాకుల కక్షతోనే ఘాతుకం

వార్త 3 weeks ago

Hyderabad Crime : హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన చిన్నపల్లి భాస్కర్ గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటూ చెఫ్‌గా పనిచేస్తున్నాడు.

గతంలో తన స్వగ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని ప్రేమించగా, కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోకుండా మూడేళ్ల క్రితం ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే భర్తతో విభేదాల కారణంగా ఆమె విడాకులు తీసుకుంది.

Read Also: KPHB Minor Girl Case:చాక్లెట్ల ఆశ చూపి మైనర్ బాలికపై అత్యాచారం!

 Hyderabad Crime

Hyderabad Crime : కక్ష కట్టి తన తమ్ముడిని పొట్టనబెట్టుకున్నారు: మృతుడి సోదరుడు

తన కూతురి విడాకులకు భాస్కరే కారణమని భావించిన యువతి తండ్రి రాజు, అతడిపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. గతంలో చంపేస్తామని బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ పగతోనే ప్లాన్ వేసిన నిందితులు, మంగళవారం హైదరాబాద్ చేరుకుని అయ్యప్ప సొసైటీలోని భాస్కర్ హాస్టల్ వద్ద కత్తులతో దాడి చేసి అతడిని కిరాతకంగా చంపేశారు. మృతుడి సోదరుడు మధు ఫిర్యాదు మేరకు రాజు, కుమారస్వామి, నాగరాజు, రాహుల్‌తో పాటు మరో వ్యక్తిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా ఆ అమ్మాయే భాస్కర్‌కు మెసేజ్‌లు చేసేదని, అనవసరంగా కక్ష కట్టి తన తమ్ముడిని పొట్టనబెట్టుకున్నారని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

కుక్కల ఇంజెక్షన్‌తో బావను హత్య ..భయంతో నిందితుడు కుటుంబంతో సహా ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha