Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదు

మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదు

వార్త 3 months ago

Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై కేసుల నమోదు పర్వం ప్రారంభమైయ్యింది.

దాదాపు 25 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడుగా కాకాణి ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఏదో ఒక కారణం చూపిస్తూ కేసులు పెడుతున్నారని వైసిపి ఆరోపణ చేస్తోంది. ఏది ఏమైనా తాజాగా ఓ రైతు విద్యుత్ కనెక్షన్ విషయంలో పొదలకూరు విద్యుత్ ఎఇ లంచం తీసుకుని మరీ పని చేయకుండా తెలుగుదేశం నాయకులతో చెప్పటంతో ఈ విషయం కాస్త బయటకు పొక్కింది. వైసిపి శ్రేణులపై కక్ష సాధిస్తున్న తెలుగుదేశం నాయకుల తీరు పట్ల విద్యుత్ శాఖ ఎఇ అవినీతి పట్ల నిరసిస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read also: Mgnrega : ఉపాధి హామీ పథకం విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

 Another case registered against former Minister Kakani.

Kakani Govardhan Reddy: బాధితుడికి అన్యాయం.. స్టేషన్ ముందు ధర్నా

న్యాయం అడిగిన బాధితుడిని ఎటువంటి రిపోర్టులు లేకపోయినా పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎస్సై హనీఫ్ తీవ్రంగా కొట్టి బెదిరించి కొట్టడాన్ని వీడియో తీసి ఆయన్ను ఆదేశించిన టిడిపి శ్రేణులకు పంపి ఎస్ఐ అవాచికంగా వ్యవహరించాడని ఆరోపణతో కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసిపి శ్రేణులతో కలిసి స్టేషన్ ముందు నడి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కానీ దురుసుగా వ్యవహరించిన ఆ ఎస్ఐ పై విచారణ ఏమైందో తెలియదు కానీ నిరసన వ్యక్తం చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసిపి నాయకులపై ట్రాఫికికి ఇబ్బంది కలిగించారంటూ తాజాగా ఎస్ఐ మరో కేసును నమోదు చేసారు. ఈ విషయమై సర్వత్రా కేసు విషయం చర్చనీయాశమైయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: అసలు ఏం జరిగిందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha