Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: అసలు ఏం జరిగిందంటే?

గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: అసలు ఏం జరిగిందంటే?

వార్త 1 week ago

Guntur Crime: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు 3 గంటల సమయంలో రైల్వే ట్రాక్ వెంట కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గస్తీలో ఉన్న పోలీసులు గుర్తించారు.

చీకటిని అదునుగా చేసుకుని వారు ఏదైనా పెద్ద దోపిడీకి స్కెచ్ వేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Read Also:Sangareddy Fire Accident: సంగారెడ్డి నేషనల్ హైవేపై మంటలు: కెమికల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధం

 Guntur Ponnuru Police Firing

Guntur Crime: దుండగుల చేతిలో ఆయుధాలు.. పోలీసులపై దాడి

అనుమానితుల వద్ద కట్టర్లు, ఇతర పదునైన ఆయుధాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. ఈ ఆకస్మిక దాడితో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరిపారు.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha