Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ MLA రేగా కాంతారావు అరెస్ట్?

మాజీ MLA రేగా కాంతారావు అరెస్ట్?

వార్త 1 week ago

Rega Kantha Rao Arrest : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాధితురాలికి యూట్యూబ్ ఛానెల్ పెట్టిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకోవడమే కాకుండా ఆర్థికంగా మోసం చేశారనే ప్రధాన ఆరోపణలపై ఈ అరెస్ట్ వేటు పడింది.

తీవ్ర ఆరోపణలు మరియు రియల్ ఎస్టేట్ మోసం - కోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెళ్లి పేరుతో నమ్మించి తనతో సన్నిహితంగా ఉండటమే కాకుండా, తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని పేర్కొంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి సాకుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ (Quash) రేగా కాంతారావు ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు రేపు సీఎం శంకుస్థాపన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha