Ex Bus Driver : పశ్చిమ బెంగాల్‌లో ఒక మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ నివాసంలో జరిగిన పోలీసు సోదాలు తీవ్ర కలకలం రేపాయి. ఒకప్పుడు సాధారణ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి ఇంట్లో ఏకంగా కోట్లాది రూపాయల నగదు, కేజీల కొద్దీ బంగారం లభించడంతో తనిఖీలు చేపట్టిన అధికారులు సైతం తీవ్ర షాక్‌కు గురయ్యారు.
ఈ దిగ్భ్రాంతికర ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే: తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మినార్ మోండల్ ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పనిచేశాడు. కొన్నేళ్ల క్రితం ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. ఉద్యోగం వదిలేసిన తర్వాత, తన బంధువైన స్థానిక వ్యాపారి టులూ మోండల్‌కు చెందిన రాళ్ల వ్యాపారంలో (Stone Business) సహాయకుడిగా చేరాడు. ఆ అనుభవంతో తర్వాతి కాలంలో సొంతంగా రాళ్ల వ్యాపారం ప్రారంభించాడు.
Ex Bus Driver : రూ.5 కోట్లకు పైగా నగదు, 15 కిలోల బంగారం
మినార్ మోండల్ అక్రమ మార్గాల్లో విపరీతంగా ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదులు, అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఆయనపై నిఘా ఉంచారు. అందులో భాగంగా బుధవారం నాడు ఆయన నివాసంపై ఉన్నపళంగా దాడులు చేసి సోదాలు నిర్వహించారు.సోదాల్లో సుమారు రూ.5 కోట్లకు పైగా నగదు, దాదాపు 15 కిలోల బంగారం లభించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగదు భారీ పరిమాణంలో ఉండటంతో దాన్ని లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాలను (Counting Machines), డబ్బును భద్రపరిచేందుకు పెద్ద ట్రంకు పెట్టెలను తెప్పించారు. నగదు లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్వాధీనం చేసుకున్న మొత్తం సొమ్ము, బంగారం ఖచ్చితమైన విలువ తెలుస్తుందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ భారీ మొత్తంలో లభించిన నగదు, బంగారం కేవలం మినార్ మోండల్‌కు చెందినవేనా? లేదా ఆయన బంధువు, రాళ్ల వ్యాపారి అయిన టులూ మోండల్ కి చెందిన నల్లధనాన్ని ఇక్కడ భద్రపరిచారా? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
లెక్చరర్ కొట్టారని.. అవమానం తట్టుకోలేక టాపర్ విద్యార్థి ఆత్మహత్య!

