Dailyhunt
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ప్రముఖులు నివాళి

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ప్రముఖులు నివాళి

వార్త 1 week ago

Nadendla Bhaskara Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులపాటు చికిత్స అందించారు.

పరిస్థితి విషమించడంతో ఇవాళ (ఏప్రిల్ 22న) తుదిశ్వాస విడిచారు.

భాస్కరరావు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం పంజాగుట్ట వైకుంఠధామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల భాస్కర్ ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు.

 Celebrities pay tribute to former CM Nadendla Bhaskara Rao’s death

Nadendla Bhaskara Rao: రాజకీయ ప్రముఖుల సంతాపం

అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలియజేశారు. నాదెండ్ల భాస్కరరావు తనయుడు, కేబినెట్ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం విలువైనదని అన్నారు. భాస్కరరావు కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పితృవియోగ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రేపు పంజాగుట్టలో నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha