Kiran Kumar Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కనుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబరు 1న తమ విదేశీ పర్యటన (ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్) ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 12 మంది సీనియర్ మంత్రులను పదవుల నుంచి తప్పించి యువ నాయకులకు చోటు కల్పించడమే కాకుండా, ఖాళీగా ఉన్న గవర్నర్ పదవుల నియామకం, మార్పులు-చేర్పులు కూడా చేపట్టనున్నారని సమాచారం.

నల్లారికి దక్కనున్న ప్రాధాన్యం
గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనను గవర్నర్ పదవికి ఎంపిక చేసే అవకాశం ప్రబలంగా కనిపిస్తోంది. సెప్టెంబరు మొదటి వారంలో విడుదలయ్యే కొత్త గవర్నర్ల జాబితాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా ఉండే అవకాశం ఉందని జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

