Dailyhunt
మాకు మేమే.. మీకు మీరే!

మాకు మేమే.. మీకు మీరే!

వార్త 1 week ago

Iran and america: ఇరాన్తో ఒప్పందం జరిగితే ఏంటి? జరగకపోతే ఏంటి? ఎప్పటికైనా మాదే పై చేయి. ఇలా ట్రంప్ హుంకరించడంలో అర్థం ఉంది. ఆయనది మొద టినుంచీ ఒకే ధోరణి.

ఇస్లామాబాద్ లో పశ్చిమాసియా యుద్ధం ముగింపు కోసం జరిగిన చర్చలు ఎంతవరకు సాఫల్యమవుతాయో ప్రపంచం యావత్తూ ఎదురు చూసింది. స్తంభించిన నిధులను విడుదల చేయాలని, లెబనాన్పై దాడులు తక్షణమే ఆపాలని ఇరాన్ కోరు తుం టే, హర్మూజ్ జలసంధి అందరిదీ కావాలనీ, దానిపై ప్రతిష్టంభన తొలగడం ఈ ప్రపంచానికి అత్యంత ఆవశ్య కమని అమెరికా చెబుతోంది. పనిలో పనిగా దాని మీద తమకూ పెత్తనం ఉంటే బాగుంటుందని అమెరికా ఆశ పడుతోంది. మా మూలుగా ఇవన్నీ మిగిలిన ప్రపంచానికి మంచి కోరికలుగానే అనిపిస్తున్నా ఆ రెండు దేశాలకు మా త్రం ఒకరి కోరికలు ఒకరికి గొంతెమ్మ కోరికల్లాగానే తోచుతున్నాయి. అందుకే శాంతి చర్చలు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు తగ్గుతారు, ఎవరు వెనుకడుగు వేస్తారు? ఇరుపక్షాల్లోనూ పట్టుదల బాగా కనబడుతోంది. అందుకే ఓ కొలిక్కి రాలేదు.

Read Also : Strait of Hormuz: టెహ్రాన్‌పై ట్రంప్ ఉక్కుపాదం: "ఇరాన్ వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు"

 iran and america

iran and america: చర్చలు విఫలం

హర్మూజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్ ఇరాన్ సార్వభౌమత్వాన్ని గుర్తిస్తారనుకోవడం కల్ల. ఖతార్ తో సహా వివిధదేశాల్లో 11లక్షల కోట్ల నిధులు ఫ్రీజ్ చేసింది. అమెరికా ఊ అంటే తప్ప అవి విడుదల కావు. ఇక్కడే సంక్లిష్టత చోటు చేసుకుంది. ఈ నేపథ్యమే ట్రంప్కి మళ్ళీ కోపం తెప్పించింది. యుద్ధ నష్ట కపరిహారం ఇమ్మని ఇరాన్ కోరుతోంది. ఇవన్నీ ఓ పట్టాన తేలే అంశాలు కావు. అందుకే శాంతి చర్చలు ముందుకు సాగలేదు. ట్రంప్ తాజాగా ఇరాను చైనా నుండి ఆయుధాలు వస్తున్నా యని, ఇదే జరిగితే చైనాకు మళ్ళీ ఇబ్బందే! ట్రంప్ అంటే ఏంటో చూపిస్తానని చర్చలు విఫలం తర్వాత అన్న మాట లివి. ఇరాన్ అమెరికా బృందాల మధ్య చర్చలు విఫలం అవుతాయని అందరూ ఊహించిందే. అమెరికాకు ఇరాన్ దేశం మీద, వారికున్న వనరుల మీద పెత్తనం కావాలి. కాగా హర్మూజ్జలసంధి వంటి కీలక వనరుల మీద పెత్తనం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. డీల్ కుదిరినా, కుదరకున్నా మేం గెలిచినట్లేనని చంకలు గుద్దు కోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. అయినా అది ఆయన వ్యవహార శైలి అని తెలిసిన వాళ్ళకు ఏమాత్రం విచిత్రంగా తోచలేదు. ట్రంప్కి లోపల్లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం తామే గెలిచామని చెప్పుకోవడంలో ఆయనకు సంతృప్తి ఉంటుంది. ఇదేదో కొత్తగా వచ్చిన ప్రవర్తన కాదు. కింద పడ్డా తానే గెలిచినట్లు బిల్డ్ అప్ ఇచ్చే రకం.

రహస్యంగా ఆయుధాలు సరఫరా

ఇక యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నందువల్లే ఇరాన్ తమ యుద్ధ విమానాలను కూల్చగలిగిందనే అనుమానం ఆది నుంచీఉన్నదే. కానీ తన చేతుల్లోఇరాన్ ఇట్టే నేలకూలుతుం దని భావించిన అమెరికాకు ఇరాన్ ఎంతకీ దిగి రాక పోవ డంతో ఆ ధృఢవైఖరికి నేపథ్యం ఏమిటో తెలుసుకోవడం కోసమేనా? అన్నట్లు చీకట్లో రాయివేసాడని ఆయన మన స్తత్వాన్ని విశ్లేషించిన వారంతా అదే మిషతో చైనాకు అమెరికా వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ అమెరికాల మధ్య చర్చ లు విఫలంకావడంతో ట్రంప్ మరింతగా రెచ్చిపోతున్నారు. కాగా ఎవరు దిగివచ్చినా, రాకపోయినా హర్మూజ్లో మరో కొత్త చిక్కు వచ్చిపడింది. సముద్ర మందుపాతరలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇరాన్ తమకు తెలియదంటోంది. పశ్చిమ ఆసియా సంఘర్షణలకి రెండువారాల సీజైర్ ఉన్నప్పటికీ, హర్మూజ్ పూర్తిగా తెరవబడలేదు. ఆదిలోనే ఇరాన్ తన శత్రు చౌకలను అడ్డుకోవడానికి చిన్న పడవల ద్వారా సముద్ర మైన్లు వేసింది. దీంతో కొన్ని ఓడలపై దాడులు కూడా జరిగాయి, రవాణా పూర్తిగా స్తంభించి పో యింది, ఇంధన ధరలు ఆకాశానికి ఎగిస్తాయి. అవి ఇప్పట్లో తగ్గడం చూడం. ఇప్పుడు ఈ మైన్లు ఇరాన్కు తలనొప్పిగా మారాయి. అంతర్జాతీయ మీడియా సమా చారం మేరకు ఇరాన్మైన్లను రికార్డుచేయకుండా చెల్లా చెదురుగా వేసింది. రికార్డు ఉన్నా, పరికరాలు దెబ్బతిని ఉండవచ్చు. వాటిని గుర్తించి తొలగించడం అతి పెద్దకష్టం. ఇరాన్ వద్ద సరైన సామర్థ్యంలేదు. సీజర్ సమయంలో అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ను తక్షణం తెరవాలని డిమాండ్చేశారు. కానీ ఇరాన్ టెక్నికల్ సమస్యలు (మైన్లు) కారణంగా చేయలేక పోయింది. దాంతో ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేయడంతో శాంతి చర్చలు అనిశ్చితంగా మారాయి. ఇకపై యుద్ధ జ్వా లలు మింటికెగసే అవకాశం ఉంది.ఈ దశలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని పరిష్కార దిశగా ఆలోచించడం అవసరం.

 iran and america

ట్రంప్ నమ్మకపోవడం

చర్చలు జరుగుతున్న సమయంలో కూడా లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు ఆపలేదు. దాదాపు పదిమంది మృతి చెందారు. ఇదిలా ఉంటే హార్మోజ్ జల సంధిలో మెరైన్ ట్రాఫిక్ డేటా ప్రకారం 426 ట్యాంకర్లు, 34ఎల్పిజి క్యారియర్లు, 196 నౌకలు చిక్కుకుపోయాయి. ఇంతటి విచిత్ర పరిస్థితిలోనూ ఇరాన్ ఇచ్చిన సందేశమే మిటంటే తాము హర్మూజ్ రక్షణ కోసం గతంలో వివిధ ప్రాంతాల్లో నాటిన సిమైన్స్ ఆచూకీ ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో నౌకలు జాగ్రత్తగా కదలాలని హెచ్చరిక చేశాయి. ఒకవేళ చర్చలు ఫలవంతమైతే తప్ప వాటి ఆచూకీ లభించవేమో అన్న అనుమానాలు లేకపోలేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు కలిగి ఉం డేందుకు వీలు లేదని అమెరికా శాసిస్తోంది. ఆది నుంచి తమకు అణ్వాయుధాల తయారీ పట్ల ఆసక్తి లేదని తమ ను నమ్మమని ఇరాన్ వివరిస్తున్నా ట్రంప్ నమ్మకపోవడం కూడా ఈచర్చల్లో గందరగోళానికి కారణంగా చెప్పుకోవాలి. ఆ షరతు విషయంలో కూడా ఇరాన్ నుంచిహామీ కావా లని కోరుతున్నారు. కాగా తాజా పరిస్థితుల్లో యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలకు తమపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని కోరడంపై మరి కొన్ని కొత్తఅనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ చర్చల పరిష్కారానికి చిక్కు ముడులుగా అడ్డుపడుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అగ్రరాజ్యాల హెచ్చరికలు బేఖాతరు: లెబనాన్ సంక్షోభాన్ని నెతన్యాహు ఎందుకు ఆపలేదు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha