Sabarimala Special Buses: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త అందించింది. మండల, మకర విలక్కు పూజా మహోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాత్రను మరింత సురక్షితంగా, సులభతరం చేసేందుకు భక్తులు, గురుస్వాములకు ఆర్టీసీ పలు రాయితీలు, ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది.
Sabarimala: అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా
Details of special bus services
బస్సుల సర్వీసుల పూర్తి వివరాలు
అయ్యప్ప స్వామి దర్శన సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ ఈ సర్వీసులను రెండు విడతలుగా నిర్వహించనుంది
- మండల పూజల కోసం: నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
- మకర విలక్కు పూజల కోసం: డిసెంబరు 30 నుంచి మరుసటి ఏడాది (నూతన సంవత్సరం) జనవరి 20 వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి.
గురుస్వాములకు ప్రత్యేక ఆఫర్లు & కమిషన్
- ఆర్టీసీ బస్సును బుక్ చేసే గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.
- ఒకవేళ గురుస్వామి ఒకానికంటే ఎక్కువ బస్సులను బుక్ చేస్తే, ఒక బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మిగతా బస్సులకు రోజుకు రూ.350 చొప్పున కమిషన్ చెల్లిస్తారు.
ఉచిత ప్రయాణ మినహాయింపులు
ప్రతీ బస్సులోనూ క్రింది పేర్కొన్న ఐదుగురికి ఆర్టీసీ ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది
- ఇద్దరు వంట మనుషులు (Cooks)
- 10 సంవత్సరాలలోపు ఉన్న ఇద్దరు చిన్ని అయ్యప్పలు (మణికంఠలు)
- ఒక లగేజీ అటెండెంట్
Sabarimala Special Buses: కేరళ బోర్డర్ టాక్స్ మినహాయింపు - ప్రయాణికులకు బిగ్ రిలీఫ్
ఈసారి టీజీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులకు కేరళ ప్రభుత్వం బోర్డర్ టాక్స్ (సరిహద్దు పన్ను) నుంచి పూర్తి మినహాయింపునిచ్చింది. దీనివల్ల భక్తులపై అదనపు ఆర్థిక భారం తగ్గి యాత్ర మరింత చౌకగా మారనుంది.
సమాచారం & బుకింగ్ వివరాలు
ఈ ప్రత్యేక బస్సుల బుకింగ్స్ మరియు ఇతర సమగ్ర వివరాల కోసం భక్తులు క్రింది ఆర్టీసీ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు:
- 040-66440000
- 040-23450033
Epaper: epaper.vaartha.com

