Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్, తమిళనాడులో పోటెత్తిన ఓటర్లు.. 2021 కంటే భారీగా పోలింగ్ నమోదు

బెంగాల్, తమిళనాడులో పోటెత్తిన ఓటర్లు.. 2021 కంటే భారీగా పోలింగ్ నమోదు

వార్త 2 months ago

Elections Record Polling: తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఘట్టం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు.

Read Also:Section 112 Evidence Act: డీఎన్ఏ పరీక్షపై సుప్రీం కోర్టు కొత్త రూల్!

గణాంకాలు ఏం చెబుతున్నాయి? (సాయంత్రం 5 గంటల వరకు)

ఈసారి ఓటింగ్ శాతం గత ఎన్నికల రికార్డులను తిరగరాసింది.

  • పశ్చిమ బెంగాల్: 152 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 89.93% ఓటింగ్ నమోదైంది. (2021లో ఇది 82%).
  • తమిళనాడు: 234 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 82.24% ఓటింగ్ నమోదైంది. (2021లో ఇది 74%).

Elections Record Polling: తమిళనాడులో చతుర్ముఖ పోరు

తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి (NTK), మరియు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) మధ్య పోరు రసవత్తరంగా సాగింది. కన్యాకుమారిలో ‘కని’ గిరిజన తెగ ప్రజలు పడవలపై వచ్చి ఓటు వేయడం ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 Tamil Nadu Election Voter Turnout 2026

బెంగాల్‌లో రెండో దశపై దృష్టి

పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు తొలి దశ ముగియగా, మిగిలిన 142 నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎటువైపు ఉందనేది ఆసక్తికరంగా మారింది.

కీలక తేదీలు

  • తమిళనాడు పోలింగ్: ఏప్రిల్ 23 (ముగిసింది)
  • బెంగాల్ 2వ దశ: ఏప్రిల్ 29
  • ఫలితాల విడుదల:మే 4, 2026

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. 8 మంది దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha