Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మామిడి పండ్లు తిని ఐదేళ్ల బాలుడు మృతి.. ఇద్దరికి తీవ్ర అస్వస్థత!

మామిడి పండ్లు తిని ఐదేళ్ల బాలుడు మృతి.. ఇద్దరికి తీవ్ర అస్వస్థత!

వార్త 6 days ago

Dahegaon Crime: వేసవి కాలంలో శరీరానికి చలవ చేస్తాయని ప్రజలు అమితంగా ఇష్టపడే పుచ్చకాయలు, మామిడి పండ్లు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఘోర ఉదంతం, అలాగే తాజాగా తెలంగాణలోని దహెగాం మండలంలో జరిగిన విషాదం.మనం తినే ఆహార భద్రతపై అనేక అనుమానాలను, భయాలను రేకెత్తిస్తున్నాయి.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు తిని ఒక ఐదేళ్ల బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వాంతులు, విరేచనాలతో అస్వస్థత

పోలీసులు మరియు స్థానికుల వివరాల ప్రకారం.. బెజ్జూర్‌ మండలం కుంటమానుపల్లికి చెందిన పోర్తెట్టి శారద, శ్రీనివాస్‌ దంపతులు దహెగాం మండలంలోని లోహ గ్రామానికి వచ్చారు. శనివారం ఉదయం శారద తునికాకు సేకరణ కోసం పనికి వెళ్లగా, ఆమె కుమారుడు శ్రీవర్ధన్‌ (5) అదే గ్రామానికి చెందిన మడే సంతోష్‌ పిల్లలైన కీర్తన (6), కీర్తి కుమార్‌ (4) లతో కలిసి ఆడుకున్నాడు. ఈ క్రమంలో చిన్నారులు ఉదయం పూట ఇంట్లో ఉన్న మామిడి పండ్లను తిన్నారు.

మధ్యాహ్నానికి ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని కొంచవెల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స అనంతరం ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో తిరిగి లోహ గ్రామంలోని ఇంటికి తీసుకువచ్చారు.

Dahegaon Crime: అర్ధరాత్రి తిరగబెట్టిన అస్వస్థత.. ఒకరి మృతి

అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు చిన్నారులు మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఐదేళ్ల చిన్నారి శ్రీవర్ధన్‌ ఇంటి వద్దే కన్నుమూశాడు. మిగతా ఇద్దరు చిన్నారులు కీర్తన, కీర్తి కుమార్‌ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారడంతో వారిని తక్షణమే మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

 Calcium carbide chemical used for artificial ripening of mangoes stored in a local fruit market.

ఈ ఘోర ఘటనపై దహెగాం ఎస్సై చుంచు రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు కాల్షియం కార్బైడ్‌ వంటి ప్రమాదకర రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారా.. లేక ప్రస్తుతం జిల్లాలో కొడుతున్న తీవ్రమైన ఎండల దెబ్బ (వడదెబ్బ) వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో వైద్యుల నివేదికల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెద్ద శంకరంపేటలో వైన్స్ ముందు వ్యక్తి మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha