Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ద శంకరంపేటలో వైన్స్ ముందు వ్యక్తి మృతి!

పెద్ద శంకరంపేటలో వైన్స్ ముందు వ్యక్తి మృతి!

వార్త 1 week ago

Pedda Shankarampet Wines: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక వైన్స్ ముందే ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.

మద్యం సేవించిన కాసేపటికే మృతి

వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అశోక్ (40) అనే వ్యక్తి ఆదివారం రాత్రి పెద్ద శంకరంపేట పట్టణంలోని శంకరంపేట వైన్స్‌కు వచ్చాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసిన అనంతరం, వైన్స్‌కు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూంలోనే కూర్చుని మద్యం సేవించాడు. అయితే, మద్యం తాగిన కొద్దిసేపటికే అతను అక్కడికక్కడే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

పర్మిట్ రూమ్‌లోనే వ్యక్తి అకస్మాత్తుగా మరణించాడనే సమాచారం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పెద్ద శంకరంపేట పోలీసులు ఏఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించారు.

Pedda Shankarampet Wines: అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం

ఈ వైన్స్ ప్రధాన రహదారి (Main Road) పక్కనే ఉండటం వల్ల నిత్యం ఇక్కడికి వచ్చేవారితో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై గతంలో పలుమార్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైన్స్ పర్మిట్ రూమ్‌లోనే మద్యం సేవించిన వెంటనే వ్యక్తి మరణించడం వెనుక ఏదైనా అనారోగ్య సమస్య ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha