Malaria Free Districts in AP: రాష్ట్రంలో మలేరియా జ్వరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ఇందులో భాగంగా బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపబోతున్నామని ప్రకటించారు. 2024- 25 నుంచి మలేరియా జ్వరాల కేసులు రాష్ట్రంలో తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. 2024-25లో 7,871 మలేరియ కేసులు రాగా, 202526లో 7,199 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు (16 వారాలు) 899 కేసులు నమో దైనట్లు చెప్పారు. కిందటేడాది ఇదే సమయంలో 1,783 కేసులు వచ్చాయన్నారు.
Read Also :Shakti App: శక్తి యాప్ తో యువతిని కాపాడాం: మంత్రి అనిత
Malaria Free Districts in AP
క్రిమిసంహారక మందుల పిచికారీకి రూ.10కోట్లు
2030 నాటికి మలేరియా కేసులు గణనీయంగా తగ్గించేందుకు పకడ్బందీగా రూపొందించిన ప్రణాళికలకు 2024-25 ລ້ రాష్ట్రంలో జ్వరాల కేసులు తగ్గుముఖం క్రిమిసంహారక మందుల పిచికారీకి రూ.10కోట్లు 2030 నాటికి కేసులు మరింతగా తగ్గిస్తాం: మంత్రి సత్యకుమార్ అనుగుణంగా చర్యలు చేడుతున్నామని తెలిపారు. ప్రపంచ మలే రియా దినోత్సవం (శనివారం ఏప్రిల్ 25) పురస్కరించుకుని మంత్రి నేదొక ప్రకటన జారీచేశారు రాబోయే వర్షాలు దృష్టిలో ఉంచుకుని బిఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేఖి కార్యక్రమాన్ని చేబట్టబోతున్నామని మంత్రి తెలిపారు.
ఇళ్లల్లోని గోడలు, పైకప్పు భాగంలో క్రిమి సంహర క మందును స్ప్రే చేయడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వీలవుతుందని వెల్లడించారు. క్రిమిసంహారక మందు కొనుగోలు, పిచికారీ, ఇతర ఖర్చుల కింద కలిపి ఏడాదికి రూ.10 కోట్ల వరకు వ్యయం చేస్తున్నామని తెలిపారు. మలేరియా జ్వరాల కేసులు అధికంగా ఉండే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం జిల్లాల్లో స్పే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సదరు ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా స్ప్రే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుసరించి చేపట్టామని తెలిపారు.
దశల వారీగా స్ప్రే కార్యక్రమం
ఇవి కాకుండా ఎంపికచేసిన మరో 13 జిల్లాల్లోనూ మే 15 నుంచి దశల వారీగా ప్రారంభించి, ఆగస్టు 30 నాటికి స్ప్రే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ 13 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, మర్కాపురం, నంద్యాల, అన్నమయ్య, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, ఏలూరు, మన్యం, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు జిల్లాలు న్నాయి. ఈ స్ప్రే కార్యక్రమ నిర్వహణకు రూ.4.5కోట్లు, పిచికారి మందు కొనుగోలు కోసం రూ.4.80 కోట్ల వరకు (అల్ఫా సైపర్ మెత్రిన్, మలాథియాన్మందు) ఖర్చు పెడుతున్నా మన్నారు. ఇతర ఖర్చుల కింద కలిపి మొత్తం రూ.10 కోట్ల వరకు వ్యయం చేస్తున్నామని మంత్రి వివరించారు.
ప్రతి వెయ్యి జనాభాలో రెండు కేసులు నమోదైన గ్రామాల్లో స్ప్రే
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేనెల వెళ్లే ప్రతిపాదనలు అనుసరించి, కేంద్ర బృందం ఈ మూడు జిల్లాల్లో పర్యటిస్తుందని తెలిపారు. నిశిత పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఖిమలేరియా ఎలిమినేషన్నిపై ప్రకటన చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో 0.15 చొప్పున కేసులు వస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.46, పార్వతీపురం మన్యం జిల్లాలో 1.95 చొప్పున కేసులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దోమల తెరల పంపిణీని ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు, పోలవరం, మన్యం జిల్లాల్లో పంపిణీ పూర్తయ్యే దశలో ఉందని పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా 1.95 లక్షల కుటుంబాలు, విద్యార్థుల వసతి గృహాలకు అందచేసే 2.55 లక్షల దోమ తెరలను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

