Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్చి నాటికి పూర్తి కానున్న హైవే

మార్చి నాటికి పూర్తి కానున్న హైవే

వార్త 2 weeks ago

Bijapur Highway:హైదరాబాద్ బీజాపూర్ హైవే ప్రయాణికులకు ఎన్‌హెచ్‌ 163 పనులు పూర్తికావడంతో ప్రయాణం సులభం కానుంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.

రోడ్డు ఒకవైపు నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో కార్లు, ద్విచక్ర వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు. మీర్జాపూర్, పూడూరు పరిధిలో ఈ మార్గం ఇప్పటికే వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. మరో రెండు నెలల్లో మొయినాబాద్, చేవెళ్ల మార్గంలో పది కిలోమీటర్ల మేర రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 46.405 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 785 కోట్లుగా ఉంది. ఈ రహదారిలో రెండు బైపాస్‌లు, పన్నెండు అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ మార్గం పూర్తిగా అందుబాటులోకి రానుంది.

Read also: Hyderabad jobs: ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానం!

 Highway to be completed by March

ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి

ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రావడం వల్ల వాహనదారులకు ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. గతంలో ఈ మార్గంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతుండటంతో ఆ సమస్యలకు చెక్ పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొయినాబాద్, చేవెళ్ల ప్రాంతాలలో బైపాస్ రోడ్డు నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భూసేకరణ వంటి కొన్ని అడ్డంకులు ఎదురైనా అధికారులు వాటిని పరిష్కరించి పనులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మార్గం పూర్తిగా అందుబాటులోకి వస్తే తెలంగాణ కర్ణాటక రాకపోకలు మరింత వేగంగా సాగుతాయి.

Bijapur Highway:చెట్ల వివాదం తీరింది.. హైవే పని జోరుగ సాగుతున్నది

ఈ హైవే నిర్మాణంలో భాగంగా వందల ఏళ్ల నాటి మర్రి చెట్ల తొలగింపుపై గతంలో కొంత కాలం పాటు న్యాయపరమైన అడ్డంకులు వచ్చాయి. చెన్నై నేషనల్ హ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే తొలగిపోవడంతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి ఆధునిక హంగులతో ఈ హైవేను తీర్చిదిద్దుతున్నారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

Epaper: epaper.vaartha.com

50 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha