Dailyhunt
మారిన ఎస్ఎ-2 టైమ్ టేబుల్

మారిన ఎస్ఎ-2 టైమ్ టేబుల్

వార్త 2 weeks ago

TS SA2 Exam New Schedule : రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మెటీవ్ అసెస్మెంట్(ఎస్ఏ) - 2 పరీక్షల షెడ్యూల్లో మార్పు చేశారు.

ఈ నెల 10 నుంచి ప్రారంభం కావల్సి ఉన్న ఎస్ఏ-2 పరీక్షలను ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నట్టు ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ(టాస్) పరీక్షల నేపథ్యంలో గతంలో ప్రకటించినట్టుగా ఎస్ఏ-2 పరీక్షలను ఈ నెల 10 నుంచి 20 వరకు కాకుండా.. ఈ నెల 8 నుంచే ప్రారంభించి 18 వరకు కొనసాగించనున్నట్టు ప్రకటించింది.

Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు

 TS SA2 Exam New Schedule: Changed SA-2 Time Table

1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11.45 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇక 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్ఏ-2 పరీక్షలను నిర్వహించ నున్నారు. ఎస్సీఈఆర్టీ సూచించిన మార్పు షెడ్యూల్ను రాష్ట్రంలోన్ని అన్ని పాఠశాలలు అమలు చేయాలని పాఠశాల విద్య డైరక్టర్ నవీన్ నికోలస్ డీఈవోలను ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

థియేటర్లలో రెంటల్ పద్ధతి రద్దు.. కొత్తగా పర్సంటేజ్ సిస్టం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha