RRB NTPC Exam Dates Changed: రైల్వే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ఆర్‌ఆర్‌బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB NTPC) అండర్ గ్రాడ్యుయేట్ (CEN 07/2025) విభాగంలో మొదటి విడత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ( CBT 1 ) పరీక్ష తేదీల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సవరించిన కొత్త పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
Read Also :TGPSC Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల
RRB NTPC Exam Dates Changed: గ్యాప్ లేకుండా వరుసగా పరీక్షలు
CBT 1 New Schedule From June 13 Released
గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ.. ఈసారి అభ్యర్థులకు ఎలాంటి విరామం (గ్యాప్) ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
- కొత్త పరీక్ష తేదీలు:జూన్ 13, 14, 15, 16 నుంచి జూన్ 20 వరకు ప్రతిరోజూ నిరంతరాయంగా ఈ CBT 1 పరీక్షలు జరగనున్నాయి.
ఎగ్జామ్ సిటీ, హాల్ టికెట్ డౌన్లోడ్ టైమ్‌లైన్:
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ వివరాలను తెలుసుకోవడానికి ఆర్‌ఆర్‌బీ కింది ప్రాసెస్ ప్రకటించింది:
1.ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ (పరీక్షకు 10 రోజుల ముందు)
అభ్యర్థులకు ఏ నగరంలో పరీక్షా కేంద్రం కేటాయించారో తెలుసుకునేందుకు, ఎగ్జామ్ డేట్‌కు 10 రోజుల ముందే అధికారిక వెబ్‌సైట్‌లో ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను’ అందుబాటులో ఉంచుతారు. దీని ద్వారా అభ్యర్థులు ముందే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు.
2.అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ (పరీక్షకు 4 రోజుల ముందు)
పరీక్ష కేంద్రం పేరు, షిఫ్ట్ సమయాలతో కూడిన పూర్తి అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) ను మీ పరీక్ష తేదీకి సరిగ్గా నాలుగు రోజుల ముందు మాత్రమే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ యాక్టివేట్ అవుతుంది.
3,058 పోస్టుల భర్తీ
రైల్వే శాఖలోని వివిధ విభాగాలలో అండర్ గ్రాడ్యుయేట్ అర్హత (ఇంటర్మీడియట్) కలిగిన అభ్యర్థుల కోసం ఉద్దేశించిన ఈ నోటిఫికేషన్ (CEN 07/2025) ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 3,058 పోస్టులను ఆర్‌ఆర్‌బీ భర్తీ చేయనుంది. భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థులు మారిన షెడ్యూల్ ప్రకారం తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు.. 382 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తి

