Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కాపురంలో వర్ష బీభత్సం.. బోడపాడులో ముగ్గురు మృతి

మార్కాపురంలో వర్ష బీభత్సం.. బోడపాడులో ముగ్గురు మృతి

వార్త 1 month ago

Markapuram rains: మార్కాపురం, బోడపాడు గ్రామంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది. పిడుగుపాటుకు ఒక మహిళ మృతి చెందగా, గాలివాన తీవ్రతతో పందిరి కూలిపోవడంతో మరో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు గ్రామస్తులు తెలిపారు.

తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించిన ఈ వర్షం, అనూహ్యంగా ప్రమాదాలకు దారితీసింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని గాలివానతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడటం గమనార్హం.

Read also: AP Registration : ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖకు భారీ ఆదాయం

 markapuram-heavy-rains-bodapadu-deaths

Markapuram rains: గాలివానకు కూలిన పందిరి

రోడ్లపై కొమ్మలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల హోర్డింగ్స్, షెడ్లు కూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ అకాల వర్షం ఒకవైపు చల్లదనాన్ని ఇచ్చినా, మరోవైపు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై నష్టాల అంచనాకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ప్రజలు వర్షాకాలంలో మెరుపులు, పిడుగుల సమయంలో బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆస్తి వ్యామోహం.. కనిపెంచిన వారినే సజీవ దహనం చేయాలనుకున్న కిరాతక పుత్రిక!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha