Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తి వ్యామోహం.. కనిపెంచిన వారినే సజీవ దహనం చేయాలనుకున్న కిరాతక పుత్రిక!

ఆస్తి వ్యామోహం.. కనిపెంచిన వారినే సజీవ దహనం చేయాలనుకున్న కిరాతక పుత్రిక!

వార్త 1 month ago

Chilakaluripet Incident: ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే దానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. చిలకలూరిపేటలో ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ కుమార్తె కన్న తల్లిదండ్రులపైనే కక్ష పెంచుకుంది.

ఆస్తిలో వాటా కావాలని గొడవపడి, ఏకంగా వారు నిద్రిస్తున్న ఇంటికే నిప్పు పెట్టింది.

Read Also : Anakapalli Road Accident: లారీ ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం

 Chilakaluripet Incident: Property obsession.. A cruel daughter who wanted to burn alive those who raised her!

తృటిలో తప్పిన ప్రాణాపాయం

నిందితురాలు ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం గమనించిన వృద్ధ దంపతులు అప్రమత్తమై సకాలంలో బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. లేనిపక్షంలో ఊపిరాడక లోపలే సజీవ దహనం అయ్యేవారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లోని విలువైన ఫర్నీచర్, సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.

కేసు నమోదు చేసిన పోలీసులు

కన్న కూతురే తమ ప్రాణాలు తీయాలని ప్రయత్నించడంపై బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కుమార్తెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అనుమానంతో ఘాతుకం.. భార్యను చంపిన భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha