Kawasaki Z900: ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి (Kawasaki) భారత్‌లో తీపి కబురు అందించింది. తన పాప్యులర్ స్ట్రీట్‌ఫైటర్ మోడల్ 'జెడ్900' (Z900) 2027 వెర్షన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.
దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే కంపెనీ ధరలో ఎలాంటి పెంపు చేపట్టకపోవడం గమనార్హం. ఈ కొత్త మోడల్‌లో ఇంజిన్ లేదా మెకానికల్ ఫీచర్లలో పెద్దగా మార్పులు చేయకుండా, ఆకర్షణీయమైన కొత్త కలర్ ఆప్షన్లపైనే కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది.
Read Also : Lay's చిప్స్ సంస్థ కు బిగ్ షాక్
New Kawasaki Z900 bike launched in the market - what's the price?
Kawasaki Z900: నూతన కలర్ ఆప్షన్లు, అగ్రెసివ్ డిజైన్
కొత్త కవాసకి జెడ్900 బైక్ రెండు నూతన కలర్ కాంబినేషన్లలో కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది:
- పర్ల్ బ్లిజర్డ్ వైట్ / ప్లాస్మా లైమ్ గ్రీన్
- ఎబోనీ / మెటాలిక్ కార్బన్ గ్రే
స్పోర్టీ లుక్‌ను ఇష్టపడే యువతకు ఈ కొత్త రంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డిజైన్ పరంగా గత మోడల్ స్టైల్‌నే కొనసాగించారు. కండలు తిరిగినట్లుండే బాడీ డిజైన్, అగ్రెసివ్ స్ట్రీట్‌ఫైటర్ స్టాన్స్ ఈ బైక్‌కు ఉన్న ప్రత్యేకమైన లుక్‌ను అలాగే నిలబెట్టాయి.
కవాసకి జెడ్900 మోడల్‌లో 948 సీసీ, లిక్విడ్ కూల్డ్, ఇన్-లైన్ 4-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 9,500 ఆర్పీఎం వద్ద 124 బీహెచ్‌పీల గరిష్ట పవర్‌ను, అలాగే 7,700 ఆర్పీఎం వద్ద 98.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు సున్నితమైన గేర్ షిఫ్టింగ్ కోసం 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
ఆధునిక ఎలక్ట్రానిక్ రైడింగ్ ఫీచర్లు
రైడర్ సౌకర్యం, భద్రత కోసం జెడ్900 బైక్‌లో పలు ఆధునిక సాంకేతిక ఫీచర్లను అందించారు. 5 అంగుళాల టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయం. క్రూజ్ కంట్రోల్, బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్ (ABS) వంటి అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ రైడింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ధర వివరాలు, డెలివరీలు
కొత్త 2027 కవాసకి జెడ్900 బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. పాత ధరకే లభిస్తుండటం, సరికొత్త కలర్స్ తో రావడం ఈ అప్‌డేట్‌లో ప్రధాన విశేషం. ఇప్పటికే ఈ కొత్త మోడల్ డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు తమ సమీపంలోని అధీకృత కవాసకి డీలర్‌షిప్‌ను సంప్రదించి బుకింగ్ మరియు లభ్యత వివరాలను తెలుసుకోవచ్చు.

