Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్పు కోసం తీర్పు!

మార్పు కోసం తీర్పు!

వార్త 2 weeks ago

Judgment for change : పంచరాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలుమార్పు కోరుతూ స్పష్టమైన తీర్పునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా పనిచేసింది. కేరళం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడిపే పార్టీలు మారుతున్నాయి.

ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ ఈ ట్రెండ్ కొనసాగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధిపత్యంలో ఉండి తమకు కొరకరాని కొయ్యలుగా ఉన్న ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీల నుంచి ప్రభుత్వాలను మార్చా లని భారతీయ జనతాపార్టీ అగ్రనేతలు భావించారు. అదే దిశగా ఆ రెండు రాష్ట్రాలపై ప్రచార పర్వంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమితాలు ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రాణప్రతిష్ట చేయాలనే తపనతో ప్రత్యేక వ్యూహరచన చేశారు. ఆ మేరకు ఒక్క పశ్చిమ బెంగాల్ లో మాత్రమే వారి పాచిక పారింది. అసోంలో తిరిగి బిజపికే జనం పట్టం కడతారని ముందుగా ఊహించినదే జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ఫిరాయింపుదారులు బిజెపిలో చేరి విజేతలయ్యాడంటే ఆ (పాంతంలో ఆపార్టీపై విశ్వస నీయత ఎంత ఉందో వేరే చెప్పక్కర్లేదు. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయన్నది సుస్పష్టం.

Read Also: Tamil Nadu Election: రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. విజయ్ వ్యూహం ఫలించేనా?

 Judgment for change

Judgment for change : ఎన్టీఆర్ తర్వాత..

తమిళనాడులో హిందూ వ్యతిరేక ముద్రతో డిఎంకె పలు చబడింది. తొలి విడత కౌంటింగ్ జరుగుతున్న వైఖరిని పసిగట్టగానే డిఎంకె ప్రధాన కార్యాలయం ముందు టెంట్లు ఎత్తేసారు. రెండేళ్ల క్రితమే రాజకీయ పార్టీ టివికెని స్థాపించిన విజయ్ అప్రతిహతంగా డిఎంకె సంప్రదాయ ఓటర్లను ఆకట్టుకోవడంలో కృతకృత్యులై నారు. ఈ రాష్ట్రంలో చాలా రౌండ్లు గడిచినా ముఖ్య మంత్రి స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి, మరో 23మంది మంత్రులు వెనుకంజలోనే ఉన్నారు. తొలుత అధికార డిఎంకె మూడోస్థానంలో కొనసాగుతూ చివరకు రెండోస్థానంలో స్థిరపడింది. రాజకీయ పార్టీలు స్థాపించిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని చేపట్టే సినీనటుల్లో ఎన్టీఆర్ తర్వాత విజయ్నే చెప్పుకోవాలి. తాను ఎవరికి సీటిచ్చినా వారికి ప్రజల్లో ఎలాంటి పలు కుబడి లేకపోయినా ‘దళపతి బ్రాండ్తోనే ఆయన పార్టీ అభ్యర్థులు గెలవడం చెప్పుకోదగిన విషయం. విజయ్ డ్రైవర్ కొడుక్కి విరుంబాక్కం అసెంబ్లీ స్థానం టిక్కెట్టివ్వ గా అతను గెలిచాడు. దీనిని బట్టే తమిళనాట విజయ్’కు ఎలాంటి ఆదరణ ఉందో ఫలితాలుచెప్పాలి. ముఖ్యమంత్రి గా స్టాలిన్ ప్రభుత్వ నిర్వహణలోని లోపాలను కడిగేసిన ప్రసంగాలు చేయక పోయినా విజయ్ విజయతీరాలకు చేరుకున్నాడు.

ప్రత్యేకమార్పు

జనం టి.వి.కె పట్ల ఆకర్షితులయ్యారంటే ప్రభుత్వం మీద ఉన్న తీవ్రత ఎంతో అర్థమౌతోంది. గతంలో ప్రభుత్వ నిర్వహణలో మేమే ఘనమంటూ చెప్పుకునే డిఎంకె, ఎడిఎంకెలు ఒకదశలో ద్వితీయ స్థానం కోసం పోటీపడ్డాయి. తమిళనాడు రాజకీయ చిత్ర పటంలో గత ఎన్నికల సంగతులు గమనిస్తే కేవలం ద్రవిడ పార్టీలే అటుఇటుగా వరుసగా ఎన్నికయి రావడం మనకు తెలిసిందే.మొన్నటిసారి డిఎంకె, ఈసారి మళ్లీ ఎఐడిఎంకె వంతు వస్తుదేమోనని కొందరు అంచనా వేశారు. కానీ తన ‘జననాయకుడు’ చిత్రం ద్వారాతమిళ ప్రజల హృదయాలను కొల్లగొట్టాలనుకున్నా ‘విజయ్’కు అడుగడుగునా ఆటంకాలెదురయ్యాయి. కానీ తాజా గెలు పుతో అసలుసిసలు రాజకీయాల్లో జననాయకుడిగా విజయ్ జనహృదయాలకు దగ్గరయ్యారు. రాజకీయాల్లో తగిన అనుభవం లేకపోయినా, జనానికి దగ్గరయ్యేమాధ్య మాలకు దూరం పెట్టినా, జనాకర్షక ప్రసంగాలు జన మందరికీ చేరకున్నా జనం మాత్రం ప్రత్యేకమార్పు కోరు కున్నారన్న విషయం ద్యోతకమవుతుంది.తుది లెక్కింపు లు పూర్తయ్యే సరికి మేజిక్ ఫిగర్ 118దాటకపోతేద్రవిడ పార్టీలను కలుపుకోవాల్సి వస్తుంది. ద్రవిడ నాట టివికె అతిపెద్ద పార్టీగా అవతరించడం దాదాపు ఖాయ మైనట్లే. అయితే ఓటర్లను పలకరించిన ఉచితాలు ఏవీ వారిని లొంగదీసుకోలేకపోయాయి.

 Judgment for change

సింగల్ పార్టీ వ్యూహం

తమిళనాడు బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్క్క భిన్నంగా ఫలితాలు వచ్చాయి. జనం తమ నాడిని బయటకు తెలియచేయకుండా జాగ్రత్తపడ డమే దీనికి కారణం అయిఉండొచ్చు. స్టాలిన్ రెండు నియోజక వర్గాల్లో పోటీచేయగా కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమి చెందారు. టి.వి.కె విజయ్ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలుపొందడం విశేషం. ఎంతో ప్రతిష్టా త్మకంగా జరిగిన ఎన్నికల్లో నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తవగానే లేచి వెళ్లిపోయే పరిస్థితి లేదు. చివరంటా నరాలు తెగే ఉత్కంఠ ఉండనే ఉంటుంది. తమిళనాడు, బెంగాల్లో ఈసారి ఎవరూ చెప్పలేనంత ఉత్కంఠ సాగిం ది. బెంగాల్లో మమతా బెనర్జీ దూకుడుకు కాలగర్భంలో కలిసిపోయిన కమ్యూనిస్టు పార్టీ ఈసారి రెండు సీట్లలో ఆధిక్యత చూసింది. ‘ఎస్ఎస్ఐఆర్’ ప్రక్రియ ద్వారా బోలె డన్ని ఓట్లు గల్లంతు చేసిందని మమతాబెనర్జీ ఆరోపిం చింది. ఇంకా ఆమెలోని ఆశ చావలేదు. తరచి చూడగా ‘దీదీ చెవిలో బెంగాళీలు పువ్వుపెట్టారనేచెప్పాలి. బెంగాల్ లో ప్రధాన పోటీ టిఎంసి, బిజెపిల మధ్యనే సాగింది. కేరళలో లెక్కింపుపూర్తయ్యేసరికి కాంగ్రెస్కూ టమిమేజిక్ ఫిగర్ను దాటింది. సింహం సింగిల్ గానే వస్తుందన్న’ రీతిలో విజయ్ ఏ ఇతర పార్టీలతోనూ కలువకుండా సింగల్ పార్టీ వ్యూహంతోనే రంగంలోకి దిగాడు. స్వల్ప మెజారిటీతోనైనా సెంచురీ కొట్టాడు. పశ్చిమ బెంగాల్ విషయంలోనే ‘దీదీ’ తన పార్టీ మనుగడను దెబ్బకొట్టే ఏ వ్యూహాన్ని అంగీకరించలేదు. ‘సర్’ పేరిట కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తనను దెబ్బతీసిందని కడదాక ఆగ్రహం వెలిబుచ్చుతూనేన్నారు. ఏదిఏమైనా గెలుపు ఎవరిదైనా ప్రజాస్వామ్యం గెలిచిందనే చెప్పాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha