Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మారుతీ నుండి త్వరలో ఏడు మోడల్స్ లాంచ్!

మారుతీ నుండి త్వరలో ఏడు మోడల్స్ లాంచ్!

వార్త 2 weeks ago

Maruti : భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తన వ్యాపార వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. హ్యాచ్‌బ్యాక్ (స్విఫ్ట్, ఆల్టో) మరియు సెడాన్ (డిజైర్, సియాజ్) విభాగాల్లో ఏళ్ల తరబడి అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ సంస్థ, ఇప్పుడు దేశంలో విపరీతమైన ఆదరణ పొందుతున్న ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌పై ప్రధానంగా దృష్టి సారించింది.

రాబోయే 5 నుండి 6 ఏళ్ల కాలంలో మార్కెట్లోకి ఏడు కొత్త ఎస్‌యూవీ మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి తోడు, దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో ఏటా 63 లక్షల కార్లు తయారయ్యే స్థాయికి మార్కెట్ చేరుకుంటుందని మారుతీ సుజుకీ అంచనా వేసింది.

హరిత ఇంధనానికి పెద్దపీట - రూ. 561 కోట్ల పెట్టుబడి

కేవలం వాహనాల ఉత్పత్తికే పరిమితం కాకుండా, పర్యావరణ అనుకూల హరిత ఇంధన (Green Energy) వినియోగాన్ని ప్రోత్సహించడంలోనూ మారుతీ సుజుకీ ముందు వరుసలో నిలుస్తోంది. బయోగ్యాస్ ఉత్పత్తిని పెంపొందించే దిశగా తొలి విడతలోనే ఏకంగా రూ. 561 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. సిఎన్‌జి మరియు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బయోగ్యాస్ ఆధారిత సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి ఇంధన స్వయంసమృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికలు మారుతీ సంస్థ మార్కెట్ వాటాను మరింత పెంచడమే కాకుండా, దేశీయ ఆటో పరిశ్రమలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

'డిజిటల్ భారత్' నివేదికను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha