Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మారుతున్న నేరాల స్వభావం: తెలంగాణ పోలీసు శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

మారుతున్న నేరాల స్వభావం: తెలంగాణ పోలీసు శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

వార్త 1 month ago

Police Department : మారుతున్న సవాళ్లు, సాంకేతిక నేరాలు మరియు ప్రజా భద్రత అవసరాలకు అనుగుణంగాతెలంగాణ పోలీసు శాఖలో భారీ రీ-స్ట్రక్చరింగ్ (పునర్వ్యవస్థీకరణ) చేపట్టారు.

గతంలో ప్రాధాన్యత కలిగిన వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద నిరోధక విభాగాలైన గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ (SIB) లలోని 513 మంది సిబ్బందిని ప్రజా సేవల విభాగానికి బదిలీ చేశారు.

Read Also: Mahesh Kumar Goud: కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ ఫైర్

 Police Department

Police Department :విభాగాల వారీగా కేటాయింపులు (513 మంది సిబ్బంది)

  • ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ & రోడ్డు భద్రత: అత్యధికంగా 224 మంది.
  • ఆహార కల్తీ & డ్రగ్ కంట్రోల్: 80 మంది.
  • విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్: 79 మంది.
  • సివిల్ సప్లైస్: 28 మంది.
  • డీజీపీ ఆఫీస్ - T-SPARK: 27 మంది.
  • ఏసీబీ (ACB), సీఐడీ (CID), సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB): చెరో 25 మంది.

పునర్​ వ్యవస్థీకరణలో రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం దక్కింది. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్డు సేఫ్టీ కోసం 224 మంది సిబ్బందిని కేటాయించారు. మరోవైపు డ్రగ్స్‌, ఆహార కల్తీ, డ్రగ్‌ కంట్రోల్‌ కోసం 80 మంది విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 79 మందిని కేటాయించారు. సైబర్‌ నేరాల నియంత్రణపైనా ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది సైబర్‌ నేరాల కారణంగా సుమారు రూ.1,750 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

Epaper: epaper.vaartha.com

కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha