Nara Lokesh Russia Visit: ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్, ఏఐ ఇంజినీర్లను వేగంగా తీర్చిదిద్దేందుకు వేదికగా సిద్దమవు తుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.
రష్యా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆ దేశ ప్రభుత్వ నియంత్రణలోని అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్ బ్యాంకుతో కీలక చర్చలు జరిపారు. మాస్కోలో స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో భేటీ అయిన లోకేష్, భారత్లో బ్యాంకింగ్, టెక్నాలజీ, స్మార్ట్సిటీ రంగాలలో సహకా రానికి సంబంధించి పలు ముఖ్యమైన ప్రతిపాద నలు చేశారు. ఈ సమావేశంలో లోకేష్ మాట్లా డుతూ… స్చేరా బ్యాంక్ అభివృద్ధి చేసిన ‘గెగాచాట్ ఎల్ఎల్ఎం’ను భారత బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు విస్తరించాలని కోరారు. పాశ్చాత్య ప్లాట్ఫారమ్లకు ఇది ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, దేశంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) నెట్వర్క్ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు, స్బేర్బ్యాంక్ యొక్క అత్యాధునిక వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ యాంటీఫ్రాడ్ నెట్ వరు భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఇంటిగ్రేట్ చేయడానికి సాంకేతిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Read also: AP Heatwave: ఏపీలో 45 డిగ్రీల సెగ.. నేడు 46 మండలాల్లో డేంజర్ బెల్స్!
Nara Lokesh in Sberbank meeting
విశాఖ ఫార్మా, వ్యవసాయ ఎగుమతిదారుల కోసం ప్రత్యేక రుణాలు
భారత్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా మున్సిపల్ కార్యకలా పాలను మెరుగుపరచడానికి స్పేర్బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్ వంటి డిజిటల్ పరిష్కారాలను అందించాలని లోకేష్ సూచించారు. ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్, ఏఐ ఇంజనీర్లను వేగంగా తీర్చిదిద్దేందుకు స్బేర్బ్యాంక్ యొక్క ప్రత్యేక శిక్షణా విధానమైన స్కూల్ కోడింగ్ అకాడమీలను భారత్లోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలోని ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల సౌలభ్యం కోసం రూపాయి, రూబుల్ వాణిజ్యానికి అనుమతులు ఇవ్వడంతో పాటు, వ్యవస్థీకృత రుణాలు అందించాలని ప్రత్యేకంగా విజప్తి చేశారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ సానుకూలంగా స్పందించారు. భారత్లో తమ కార్యకలాపాలను వివరిస్తూ, న్యూఢిల్లీలోని కార్యాలయం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. బెంగళూరులోని తమ ఐటీ హబ్, రూపాయిరూబుల్ వాణిజ్య లావాదేవీలకు సమన్వయ కేంద్రంగా పనిచేస్తోందని చెప్పారు. న్యూఢిల్లీ, ముంబైలోని తమ శాఖలు వ్యూహాత్మక వాణిజ్య కారిడార్లలో మోలిక సదుపాయాల పెట్టుబడులకు గేట్వేలుగా ఉన్నాయని వివరించారు. మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని యెఫిమోవ్ హామీ ఇచ్చారు. మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న స్చేర్బ్యాంక్, రిటైల్ బ్యాంకింగ్తో పాటు క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో విస్తరించిన భారీ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రిటైల్, 35 లక్షల కార్పొరేట్ ఖాతాదారులను కలిగి ఉన్న ఈ బ్యాంకు, 12,000 శాఖలతో ప్రతిరోజూ 8 కోట్ల మంది డిజిటల్ వినియోగదారులకు సేవలందిస్తోంది.
Nara Lokesh Russia Visit:ప్రముఖ రష్యన్ సంస్థ రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఒ ఇల్యా కోసివ్ తో లోకేష్ సమావేశం
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, మాస్కోలో కీలక సమావేశం నిర్వహించారు. రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, మిథనాల్ కెమికల్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఒ ఇల్యా కోసిహ్, అంతర్జాతీయ వ్యాపార విభాగాధిపతి దర్యా అషానియాలతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, పలు కీలక ప్రతిపాదనలను వారి ముందుంచారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "భారత్ దిగుమతి చేసుకునే పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్న్ను ప్రాసెస్ చేసేందుకు వీలుగా, భారత తూర్పు తీరంలోని విశాఖ కాకినాడ పిసిపిఐఆర్ పరిధిలో రస్ కెమ్ ఆధ్వర్యంలో ఒక అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి” అని ఆహ్వానించారు. పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ల నిర్మాణం, బల్క్ కెమికల్ స్టోరేజీ వసతులు, ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్త్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అంతేకాకుండా, ఎపిలో అందుబాటులో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుని ఒక కొలాబరేటివ్ పాలిమర్ అప్లికేషన్, మెటీరియల్ సైన్స్ పరిశోధన కేంద్రాన్ని స్థాపించాలని సూచించారు. రస్ కెమ్ టెక్నాలజీతో పునరుత్పాదక ఇంధన కారిడార్లను అనుసంధానిస్తూ, తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే రసాయనాల తయారీ యూనిట్ను నెలకొల్పాలని విజప్తి చేశారు.
రస్ కెమ్ గ్రూప్‌తో కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ చర్చలు
మంత్రి లోకేష్ (nara lokesh) ప్రతిపాదనలపై రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఒ ఇల్యా కోసిహ్ సానుకూలంగా స్పందించారు. భారత్లో ప్రత్యేక ఎస్పివిల ద్వారా హోల్ సేల్ కెమికల్ పంపిణీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని, ఇప్పటికే ముంబై, కాన్పూర్లలోని పంపిణీ కేంద్రాల ద్వారా పరిశ్రమలకు అవసరమైన రసాయనాలను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ సరఫరా కేంద్రం ద్వారా విశాఖపట్నం, కాకినాడలోని ఫార్మా, తయారీ పరిశ్రమలకు కీలక రసాయనాలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్లోని భారీ పెట్రోకెమికల్ ప్లాంట్లను ఉపయోగించుకుని తమ గ్లోబల్ ఖాతాదారులకు స్థిరమైన సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలు ఆశాజనకంగా ఉన్నాయని, వీటిపై తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తామని ఇల్యా కోసిహ్ తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
పిఠాపురం యువతకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్.. ఈ నెల 6న మెగా జాబ్ మేళా!

